తంగేడు ఆకులపై తెలంగాణ ఉద్యమ చరిత్రను రచించి ప్రపంచ వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడో సూక్ష్మ కళాకారుడు. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటకు చెందిన దుర్గం విజయ్ కుమార్ నెల రోజులపాటు శ్రమించి 20 ఆకులపై ఉద్యమ చరిత్రను రచించాడు. దీనితో అతనికి ఈ అవార్డు లభించింది. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని భారతదేశ ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఏపీ సమన్వయకర్త డాక్టర్ స్వర్ణశ్రీ గురువారం విజయ్ కుమార్ కి అందించారు.