//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేపటి నుంచి వస్త్రవ్యాపారాలు బంద్

Category : business

టెక్స్‌టైల్ పరిశ్రమపై వస్తు సేవా పన్ను(జీఎస్టీ) విధింపునకు వ్యతిరేకంగా మంగళవారం (ఈ నెల 27) నుంచి మూడురోజులపాటు వస్త్రదుకాణాలను బంద్‌చేయాలని నిర్ణయించారు. దేశ్యావాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమ 72గంటల బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ (టీఎస్‌ఎఫ్‌టీఏ) ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40వేల వస్త్ర వ్యాపార సముదాయాలు మూతపడనున్నాయి. జీఎస్టీ 14వ కౌన్సిల్ సమావేశం వరకు టెక్స్‌టైల్ పరిశ్రమపై పన్ను విధించలేదని, ఈ నెల 3న జరిగిన 15వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఐదుశాతం క్యాటగిరీలోకి వస్త్ర పరిశ్రమను తీసుకురావడంపై టీఎస్‌ఎఫ్‌టీఏ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నది.

దేశంలో వ్యవసాయరంగం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగాన్ని పన్ను పరిధిలోకి తీసుకురావడాన్ని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలన్నీ వస్త్రపరిశ్రమను పన్ను పరిధి నుంచి మినహాయించాయని, ఏన్డీయే ప్రభుత్వ మాత్రం పన్ను వేయడాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. బంద్‌లో పాల్గొంటామని వస్త్రపరిశ్రమకు సంబంధించిన 11 సంఘాలు ప్రకటించాయి. జీఎస్టీ ద్వారా పరోక్షంగా వినియోగదారులపై భారం పడుతుందని, వస్త్రపరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వారిపై ప్రభావం చూపుతుందని టీఎస్‌ఎఫ్‌టీఏ అధ్యక్షుడు ప్రకాశ్.. రెడ్‌హిల్స్ ఫ్యాప్సీలో ఆదివారం మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం స్పందించకపోతే ఈ నెల 30న మెగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు.