//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యంగ్ టైగర్ కి 'సైకిల్' పగ్గాలు ?

Category : national

జూనియర్ ఎన్టీఆర్ లేదా బ్రహ్మణి.. ఎవరో ఒకరికి తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు అప్పగించాలి.. అనేది ఈ ప్రాంత టీడీపీ నేతల నుంచి గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న డిమాండ్. తాజాగా తెలంగాణ తెలుగుదేశం సమావేశంలో చంద్రబాబు ముందు కూడా ఇదే డిమాండ్ ను చేశారు తమ్ముళ్లు.

టీటీడీపీ బాధ్యతలు ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలంటూ సీఎం చంద్రబాబునాయుడు ముందే ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ముందే కార్యకర్తలు ఈ నినాదాలు చేశారు.

తెలంగాణలో పార్టీనాయకత్వ బాధ్యతలను సినీ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు కానీ, బాబు కోడలు, బాలయ్య కూతురు అయిన బ్రహ్మణికి గానీ అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. మరి ఈ డిమాండ్ పట్ల బాబు ఎలా స్పందించారనేది ఆసక్తిదాయకం. కార్యకర్తల డిమాండ్ పై బాబు స్పందిస్తూ.. పార్టీకి దూరదూరంగా మెలుగుతున్న తారక్ కు తెలంగాణ బాధ్యతలు ఇస్తానన్నారా? లేక కోడలు బ్రహ్మణిని ప్రత్యక్ష రాజకీయాల వైపు తీసుకొస్తానన్నారా? అంటే.. ఈ డిమాండ్ పట్ల బాబు తనదైన రీతిలో స్పందించారని చెప్పాలి.

టీటీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని, తెలంగాణలో టీఆర్ఎస్ తో పాటు బీజేపీతో కూడా టీడీపీ పొత్తు పెట్టుకోవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేయగా వారిని చంద్రబాబు సముదాయించినట్టు సమాచారం. కార్యకర్తల అభిప్రాయం మేరకే పొత్తులు ఉంటాయని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

‘తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న విషయం వాస్తవమే. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి డిమాండ్లు రావడం సహజమే..’ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఆ డిమాండ్ పట్ల అంతకు మించి స్పందించలేదు. ‘తారక్ లేదా బ్రహ్మణి.. ’ అనే డిమాండ్ పట్ల ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు తెలుగుదేశం అధినేత. దీన్ని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయంలోకి నారా లేదా నందమూరి కుటుంబీకులను దించే ఆసక్తి చంద్రబాబుకు లేదని స్పష్టం అవుతోంది.