//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అశోక్ ఉంది అక్కడే ... కాల్ డేటా ఆధారంగా గుర్తించిన తెలంగాణా సిట్

Category : state

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కదలికలను పసిగట్టింది. అశోక్ కాల్ డేటాను పరిశీలించిన సిట్ అధికారులు.. అశోక్ కదలికలను గుర్తించారు. డేటా చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అశోక్ హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్లినట్టు.. అక్కడి నుంచి గుంటూరు వెళ్లినట్టు కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు గుర్తించారు. గుంటూరు వెళ్లేలోగా అధికారులు, రాజకీయ నాయకులకు అశోక్ కాల్ చేసినట్లు కనుగొన్నారు. విజయవాడ-గుంటూరు ప్రాంతాల పరిధిలో అశోక్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ ప్రజల డేటాను చోరీ చేసినట్టు ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఎండీ అశోక్ పై ఆరోపణలు ఉన్నాయి. డేటా చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అశోక్ కోసం గాలిస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ కంపెనీలో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు, హార్డ్ డిస్క్ లు, ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని డేటాను పరిశీలించారు. ఎండీ అశోక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

అశోక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ కేసులో కీలక విషయాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ తో ఐటీ గ్రిడ్స్ కంపెనీకున్న సంబంధాలపై ఆరాతీస్తున్నారు. డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో వైపు అశోక్ రాజకీయ దురుద్దేశం తో ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని తెలంగాణా కు ఐటీ గ్రిడ్స్ కు ఎలాంటి సబంధం లేదని కోర్టులో పిటీషన్ వేశారు . ప్రస్తుతం అశోక్ పిటీషన్ పై విచారణ కొనసాగుతుంది.