//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలింగ్ ప్రారంభం....నేతల్లో టెంక్షన్ ..!

Category : politics state

తెలంగాణలో మరో కీలకఘట్టానికి కొద్దిసేపటి ముందే తెరలేచింది . శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది . గత నెలన్నర రోజులుగా ప్రచారాలతో హోరెత్తించిన నేతల భవిష్యత్ నేటితో తేలనుంది . ఎన్నికల విధుల్లో ఉన్న 2 లక్షలమంది సిబ్బంది సర్వం సిద్ధం చేసారు . సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే నిలిపివేయనున్నట్టు ఈసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తొలిసారి వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల తన ఓటు ఎవరికీ పడిందో తెలుసుకునే వీలు ఓటరుకు ఉంటుంది.

ఇక పొతే తెలంగాణలో మొత్తం 55,329 బ్యాలెట్ యూనిట్లు, 42,751 వీవీపాట్ యంత్రాలను రేపాటు చేసారు . గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లిలో అత్యధిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మల్కాజిగిరి నుండి బరిలో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 3,873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 280 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు .

ఇక పొతే తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు , వారి భవిష్యత్ ఏంటో నేటి సాయంత్రానికి ఈవియంలలో చేరబోతోంది. టీఆర్ఎస్ 119 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 99, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3, ఎంఐఎం 8, బీజేపీ 118, బీఎస్పీ 107, సీపీఎం 26, ఎన్‌సీపీ 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

25 నియోజకవర్గాల్లో 15 మంది లోపే పోటీ చేస్తుండగా, 76 నియోజకవర్గాల్లో 16 నుంచి 31 మంది పోటీ చేస్తున్నారు. 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో 32 కంటే ఎక్కువమంది బరిలో ఉన్నారు. మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,41,56,182 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,39,05,811 మంది. అలాగే ఈ నెల్ 11 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి .అలాగే పోటీలో నిలిచిన ప్రతి ఒక్కరిలోనూ కొంచెం ఆందోళన కనిపిస్తుంది . కొందరు తమ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు . దీనితో ఇప్పుడు అందరూ తెలంగాణ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరనే కోణం లో చర్చించుకుంటున్నారు .

Related News