//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ అభ్య‌ర్థికి డిపాజిట్ రావ‌డం కూడా క‌ష్ట‌మే..!

Category : politics

స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ TRS ఎమ్మెల్యే అభ్య‌ర్థి రాజ‌య్య‌కు ఓట్లేయం, ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిపించం. 2014 ఎన్నిక‌ల్లో మా గ్రామానికి ఇచ్చిన హామీల‌న్నిటినీ అమ‌లు చేస్తేనే అత‌న్ని మ‌ళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలో.. వ‌ద్దో ఆలోచిస్తాం. అంతే త‌ప్ప రాజ‌య్య‌కు ఓటేసే ప్ర‌స‌క్తే లేద‌ని, త‌మ గ్రామానికి జ‌రిగిన న‌ష్టాన్ని నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లంద‌రికీ వివ‌రించి రాజ‌య్య‌ను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకుంటామంటూ ర‌ఘునాథ‌ప‌ల్లి మండ‌లం కిలాస‌పురం గ్రామానికి చెందిన 300 మంది రైతులు త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. Telangana people comments on TRS Leader Rajaiah

ఇక అస‌లు విష‌యానికొస్తే, శుక్ర‌వారం నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా TRS ఎమ్మెల్యే అభ్య‌ర్థి రాజ‌య్య ర‌ఘునాథ‌ప‌ల్లిలో ముమ్మ‌ర ప‌ర్య‌ట‌న చేశారు. టీఆర్ఎస్ ప్ర‌చార ర‌థంపైకి ఎక్కి ప్ర‌చారం ప్రారంభించిన రాజ‌య్య ర‌ఘునాథ‌ప‌ల్లిలోకి ప్ర‌వేశించ‌గానే ఆ గ్రామ ప్ర‌జ‌లు ఆయ‌న్ను అడ్డుకున్నారు. రాజ‌య్య గో బ్యాక్‌.. గో బ్యాక్‌.. మా గ్రామానికి 2014లో ఇచ్చిన హామీలు తాగు, సాగునీరు అందించిన త‌రువాత‌నే త‌మను ఓటు అడ‌గాల‌ని హెచ్చ‌రించారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ గ్రామంలోకి అడుగుపెట్ట‌నీయ‌మంటూ రాజ‌య్య‌ను ఉద్దేశించి ప్ర‌జ‌లు నినాదాలు చేశారు. దీంతో రాజ‌య్య అక్క‌డ్నుంచి టీఆర్ఎస్ ప్ర‌చార ర‌థంతో స‌హా వెనుదిర‌గాల్సి వ‌చ్చింది.Telangana people comments on TRS Leader Rajaiah

అనంత‌రం గ్రామ ప్ర‌జ‌లు మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల్లో రాజ‌య్య గ‌మ గ్రామంలో ఎన్నిక‌ల ప్ర‌చారం చేశార‌ని, ప్ర‌చారంలో భాగంగా త‌మకు తాగునీరు, పంట పొలాల‌కు సాగునీరు ఇవ్వ‌డంతోపాటు చెరువుల‌న్నింటిని పూర్తిగా నింపుతాన‌ని హామీ ఇచ్చార‌ని, తాను ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌దాన్ని కూడా రాజ‌య్య అమ‌లు చేయ‌లేద‌ని, 2014లో త‌మ గ్రామానికి వ‌చ్చిన రాజ‌య్య‌..మ‌ళ్లీ ఎన్నిక‌లు రావ‌డంతో త‌మ గ్రామానికి ఓట్ల కోసం వచ్చాడ‌ని చెప్పారు. అటువంటి వ్య‌క్తి త‌మ గ్రామానికే కాదు.. నియోజ‌క‌వ‌ర్గానికి సైతం ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉండ‌టం ప్ర‌జ‌ల‌కు మంచిది కాద‌ని సూచించారు.Telangana people comments on TRS Leader Rajaiah

Related News