//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మంత్రుల మధ్య చాంబర్ల కోసం పోటీ .. లక్కీ నంబర్ల ఆధారంగా నివాసాల ఎంపిక

Category : politics state

తెలంగాణా సీఎం కేసీఆర్ లానే తెలంగాణాలోని ప్రజాప్రతినిధులకు సెంటిమెంట్లు ఎక్కువనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. కొన్ని విషయాల్లో వారు ఈ సెంటిమెంట్లను ఎక్కువగా పాటిస్తుంటారు. మంత్రిగా ప్రమాణం చేసిన వారు... తమ చాంబర్ల ఎంపిక విషయంలో ఇలాంటి సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి.

తాజాగా కొందరు తెలంగాణ కొత్త మంత్రులు సైతం... ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తి కావడంతో... ప్రభుత్వం మంత్రులకు ఛాంబర్లను కేటాయించింది. ఇందుకు సంబంధించిన జీవో కూడా జారీ అయ్యింది.

సచివాలయంలోని డి బ్లాక్‌లో ఉన్న మూడు అంతస్తుల్లో కొత్త మంత్రులకు చాంబర్లను కేటాయించారు. గతంలో మంత్రి హరీశ్ రావు వినియోగించిన చాంబర్‌ను కొత్తగా మంత్రి అయిన కొప్పుల ఈశ్వర్‌కు కేటాయించారు. అయితే గతంలో హోంమంత్రిగా వ్యవహరించిన నాయిని నర్సింహారెడ్డి చాంబర్ కోసం ఇద్దరు మంత్రులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి నాయిని నర్సింహారెడ్డి హోంశాఖతో పాటు కార్మిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు.

దీంతో ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్న తనకు గతంలో నాయిని వినియోగించిన చాంబర్‌ను కేటాయించాలని మల్లారెడ్డి కోరినట్టు తెలుస్తోంది. అయితే మరో మంత్రి కూడా తనకు నాయిని చాంబర్ కావాలని పట్టుబట్టినట్టు సమాచారం. దీంతో మల్లారెడ్డి చాంబర్ అంశాన్ని పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రుల నివాస సముదాయాల్లో బంగ్లాలను కేటాయించే ప్రక్రియ పూర్తయ్యింది. లక్కీ నంబర్ల ఆధారంగా మంత్రులు బంగ్లాలను ఎంచుకున్నారని సమాచారం.