//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గల్లా ప్రసంగం పై తెరాస ఎంపీల అభ్యంతరం..!

Category : politics

అప్రజాస్వామికంగా ఏపీని విభజించారంటూ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏపీనే అని అన్నారు.

రాజధాని లేదు...ఆదాయంలో లోటు ఉందని, ఏపీ అనిశ్చతిలో ఉందని గల్లా పేర్కొన్నారు. మందబలంతో, వివక్షతతో అన్యాయంగా గొంతునొక్కి విభజన బిల్ పాస్ చేశారని ఆరోపించారు. తెలంగాణకు ఆస్తులు...ఏపీకి అప్పులు ఇచ్చారని అన్నారు.

దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. తమ స్థానాల్లో నిలబడి ఆందోళన తెలిపారు. ఎంపీ గల్లా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

Related News