తెలంగాణ రాజకీయాలలో కెసిఆర్ తో డీ అంటే డీ అనే నాయకుడు ఎవరైన ఉన్నారంటే ముందుగా చెప్పుకొనే పేరు రేవంత్ రెడ్డి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. 2014 ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ అభ్యర్థుల్ని భయపెట్టి టిఆర్ఎస్ లో చేరేటట్టు చేసాడు కెసిఆర్. ఆ తరువాత రేవంత్ మాట తీరు, ధైర్యానికి భయపడిన కెసిఆర్ రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసాడు. అప్పట్లో ఓటుకు నోటు కేసు రేవంత్ పై పెద్ద దుమారమే రేపింది. అప్పుడు రేవంత్ ని జైలుకి కూడా పంపించాడు కెసిఆర్.
తెలంగాణలో జరుగుతున్నా రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. పార్టీలో చురుకుగా ఉంటూ బలమైన నేతగా ఎదిగాడు. కాంగ్రెస్ లో బలమైన నాయకులూ ఉన్న, రేవంత్ పేరు వస్తే చాలు ఇటు ఆయన అభిమానులు అటు ఓటర్లు ఉత్సాహంతో ముందుకు వస్తారు. అయితే కాంగ్రెస్ లో లీడర్లు ఎక్కువ. పదవులు కోసం ఒకరికొకరు పోటీపడుతుంటారు. కానీ ఏ ఒక్క నేత కూడా మిగిలిన వారిని ఒక తాటిమీదకి తీసుకు రాలేరు. అయితే ఒక రేవంత్ రెడ్డి కె నాయకులందరినీ ఒక తాటిమీదకి తెచ్చే సామర్థ్యం ఉందని, కెసిఆర్ ను కూడా దీటుగా ఎదుర్కునే నాయకుడు ఆయనేనని అంటున్నారు రాజకీయా వర్గాలు.
2019 ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయవర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి ని కాకా వేరే ఎవరినైనా ప్రకటిస్తే టిఆర్ఎస్ విజయం ఖాయమని అంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ మహాకూటమిగా పోటీచేస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అయితే ఇరు పార్టీల నేతలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని రాజకీయ విశ్లేషకుల అంచనా. మహాకూటమిలో సీఎం అభ్యర్థి ఎవరో తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడాలసిందే.