//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ దే హవా.....!

Category : politics

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ హవానే కొనసాగుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తోంది. మొత్తం రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గానూ ఆ పార్టీ అత్యధికంగా 15 సీట్లు గెలవనుందనీ.... పలు జాతీయ చానళ్లు తమ సర్వేల ద్వారా తేల్చి చెప్పాయి.పలు సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం టీఆర్‌ఎస్‌కు 12 నుంచి 15 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ కి 1 లేదా 2 సీట్లు... ఎంఐఎం మరో సీటు గెలుచుకోనుందనీ. బీజేపీ తన ఖాతా కూడా తెరవదని సమాచారం. అలాగే ఇండియా టుడే సర్వే ప్రకారం అయితే టీఆర్‌ఎస్‌కు 10–14 స్థానాలు వచ్చే అవకాశం ఉందని. కాంగ్రెస్‌కు 1–4 స్థానాలు, బీజేపీకీ అదే స్థాయిలో సీట్లు రావొచ్చని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. ఇక అన్ని జాతీయ చానళ్ల సర్వేల్లోనూ ఎంఐఎం తన ఒక్క స్థానాన్ని గెలవ బోతుందని చెప్పడం జరిగింది.

ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం అన్ని సర్వేల్లో కాంగ్రెస్‌ కనీసం ఒక్క స్థానం గెలుచుకుంటుందని తేలింది. ఒక్క న్యూస్‌ఎక్స్‌ సర్వే మినహా అన్నింటిలోనూ బీజేపీకి ఒక్క స్థానం గెలుచుకోబోతోందనీ. దీంతో ఆ ఒక్క స్థానం ఏమిటనేది ఆ రెండు పార్టీల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. మిగిలిన సర్వేల్లో ఆ రెండు పార్టీలకు మూడు స్థానాల వరకు రావొచ్చని చెప్పగా... అందులో కాంగ్రెస్‌ పార్టీకి నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం, మల్కాజిగిరి స్థానాలపై ఆశలు పెట్టుకోగా, బీజేపీ మాత్రం సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో సానుకూల ఫలితాలను ఆశిస్తోంది. ఈ సర్వేల ప్రకారం కనీసం ఒకటి లేదా మూడు స్థానాలు గెలిచే అవకాశం ఆ రెండు పార్టీలకు ఉన్నా గెలుపు తీరం ఎక్కడ చేరుతుందన్నది మాత్రం ఈ నెల 23 వ తేదీ వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి.