//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ హీరో ఆంధ్ర యాసలో మెప్పించగలడా...

Category : movies

ఇక్కడ అసలు విషయం ఆంధ్రా-తెలంగాణ కాదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ హీరో, కాకినాడ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం చెప్పుకోదగ్గ విశేషం.అదే డియర్ కామ్రేడ్ మూవీ. రీసెంట్ గా సెట్స్ పైకొచ్చిన ఈ సినిమాపై చాలా అనుమానాలున్నాయి. వాటిలో కొన్నింటిపై మేకర్స్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా తొండంగి అనే గ్రామంలో ఈ డియర్ కామ్రేడ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇది సినిమా పూర్తిగా కాకినాడ బ్యాక్ డ్రాప్ లో తిరుగుతువుంటుంది. కాకినాడలోని ఓ కాలేజీలో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. హీరోను కాస్త రెబల్ గా చూపించే ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ బ్యాక్ డ్రాప్ ను, సెట్ లో కొంతమంది కమ్యూనిస్టుల ఫొటోల్ని వాడుకుంటున్నామని మేకర్స్ స్పష్టంచేశారు.

ఎంత వరకు అన్ని బాగున్నా, కానీ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డైలాగ్స్ తో ఎంతమేర మెప్పిస్తాడో అని అందరూ అనుకుంటున్నారు. గోదావరి యాసలో, మరీ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి యాసలో దేవరకొండ డైలాగ్స్ చెప్పగలడా అనేది సందేహం. ఈ అనుమానం అందరికి ఎందుకు వచ్చిందంటే...మహానటి సినిమాలో చిన్న పాత్ర చేసిన విజయ్ దేవరకొండ.. తన డైలాగ్ డెలివరీని మార్చుకోలేక ఇంతకుముందులాగే చెప్పాడు.

ఆ సినిమా మొత్తానికి అతడి పాత్రే కాస్త తేడాకొట్టింది. అలాంటిది ఇప్పుడు డియర్ కామ్రేడ్ లో సినిమా మొత్తం గోదావరి యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చూడాలి మరి విజయదేవరకొండ ఎంతమేర మెప్పించగలడో....