//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గందరగోళం లో తెలంగాణ విద్యుత్తు సంస్థ ...

Category : state

రాత్రికి రాత్రే బదిలీలు. ఏసీబీ కేసులున్నా కోరుకున్న పోస్టింగులు. విద్యుత్ సంస్థల్లో బదిలీల వ్యవహారం వెనుక పైరవీలు నడిచాయా? హైకోర్టు ఆదేశంతో అక్రమాలు బయటికొస్తాయా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉద్యోగుల సాధారణ బదిలీలు దుమారం రేపుతున్నాయి.

అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో అధికారగణం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో గతంలో బదిలీ అయిన కొందర్ని మళ్ళీ బదిలీ చేయడం వివాదాస్పదమైంది. ఎస్పీడీసీఎల్ సీఎండీ బంధువు ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో తలదూర్చి నిబంధనల్ని పక్కనపెట్టారని ఆరోపిస్తున్నారు విద్యుత్ ఉద్యోగులు.

ఏసీబీ కేసులున్నవారికి కూడా బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చారనేది ఉద్యోగుల ఆరోపణ. 5 నుంచి 8 లక్షల రూపాయల దాకా ముడుపులు తీసుకుని బదిలీలు చేయిస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. బదిలీల ప్రక్రియ మొదలు కాకముందే కొందరు ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్లు వచ్చాయని కొందరు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. దీంతో విద్యుత్ శాఖలోని ఒక్క ఎస్పీడీసీఎల్‌లోనే బదిలీలు ఇంత ప్రహసనంగా ఉంటే.మిగిలిన డిస్కమ్‌లలో ఇంకెన్ని విచిత్రాలు జరిగుంటాయోనని ఉద్యోగులు అంటున్నారు.

ఒకవైపు అక్రమ బదిలీలు, మరోవైపు అవినీతి ఆరోపణలు విద్యుత్‌ సంస్థని కుదిపేశాయి. తీవ్ర ఆరోపణలున్న ఎస్పీడీఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్ రెడ్డిని సమర్ధించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించటంతో కేసు విచారణ సోమవారానికి వాయిదాపడింది. సచివాలయానికి పక్కనే ఉన్న సంస్థల్లోనే ఈ స్థాయి అక్రమాలు జరగడం చర్చనీయాంశమైంది. మొత్తానికి ఈ సంస్థలో జరుగుతున్న వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Related News