Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జోరుగా పోలింగ్ ....ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 శాతం నమోదు ....!

Category : politics

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. సమస్యాత్మక(13) నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కు అవకాశం ఉంది. ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం పోలింగ్ జరిగింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలుచోట్ల బ్యాలెట్ యూనిట్లు - వీవీ ప్యాట్లను మార్చారు. ఓటువేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ఇప్పటివరకు జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

ఖమ్మం(8శాతం) - రంగారెడ్డి(8.26శాతం) - భద్రాద్రి కొత్తగూడెం(9.7శాతం) - ఆసిఫాబాద్(8.2శాతం) - ఆదిలాబాద్(9.8శాతం) - మంచిర్యాల(10.6శాతం) - నిర్మల్(9.6శాతం) - కరీంనగర్(9.9శాతం) - సిరిసిల్ల(11.2శాతం) - జగిత్యాల(12.6శాతం) - పెద్దపల్లి(7.5శాతం) - నల్గొండ(11.81శాతం) - మహబూబ్ నగర్(11.5శాతం) - కామారెడ్డి(10శాతం) - నిజామాబాద్(7.5శాతం) - జోగులాంబ గద్వాల(15శాతం) - వనపర్తి(10శాతం) - నాగర్ కర్నూల్(5.6శాతం) - వరంగల్ అర్బన్(6.23శాతం) - వరంగల్ రూరల్(8.5శాతం) - సంగారెడ్డి(14శాతం) - సిద్ధిపేట(11శాతం) - మెదక్(9శాతం) - యాదాద్రి భువనగిరి(9.5శాతం) - సూర్యాపేట(9.28శాతం) - జనగామ(9.27శాతం) - భూపాలపల్లి(9.5శాతం) - మహబూబాద్(9.2శాతం) - మేడ్చల్(8.3శాతం) - వికారాబాద్(15శాతం)