//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణా వార్ లో నువ్వా నేనా........... పోల్ మేనేజ్మెంట్ కీలకం

Category : politics state

తెలంగాణ ఎన్నికల్లో అటు టీఆర్ఎస్, ఇటు కూటమి ధీటైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి .టీఆర్ఎస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై మరింత కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకొన్నాయి. అలాగే కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న స్థానాలపై కూడా గులాబీ పార్టీ అంతే వ్యూహాత్మకంగా వుంది. ఇక రెండే రోజులు పోలింగ్ కు సమయం ఉన్న నేపధ్యంలో గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మరింత దృషి కేంద్రీకరించాలని పోటాపోటీగా పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి.

ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాలు వరుస భేటీలు నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సరళిపై నేతలు చర్చించారు.టీఆర్ఎస్‌‌కు ధీటుగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహణపై చర్చించారు. ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, టీఆర్ఎస్ అభ్యర్థుల తీరు ఎలా ఉందనే విషయమై చర్చించారు. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలపై దృష్టికేంద్రీకరించాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.

మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడ కట్టడి చేసేలా వ్యూహాన్ని రచించాలని నేతలు నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే కూటమికి చెందిన ముఖ్య నేతలు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దాదాపు కూటమి ముఖ్యనేతాలకే టీఆర్ ఎస్ నేతలు చెమటలు పట్టిస్తున్నారు. మంత్రులు, టీఆర్ఎస్ అగ్రనేతలను తమ నియోజకవర్గాలకే పరిమితం చేసేలా చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఇంకా రెండే రోజు సమయం ఉండటంతో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళే ప్రచారం నిర్వహించనున్నారు.

పోల్ మేనేజ్‌మెంట్ సక్రమంగా చేసుకోలేకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. పోల్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు నాయడు చాలా వ్యూహాత్మకంగా ఉంటారని అందరికీ తెలుసు. కాబట్టె పోల్ మేనేజ్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బాబు చర్చించారు. దీంతో చంద్రబాబునాయుడుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యి ఈ విషయమై చర్చించారు. బూత్‌ లెవల్ స్థాయిల్లో పోల్ మేనేజ్‌మెంట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. బూత్ స్థాయి నుండి ఓటర్లను ఆకట్టుకొనేలా వ్యూహం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే పకడ్బందీ వ్యూహాలతో పోల్ మేనేజ్ మెంట్ నిర్వహించేందుకు సైన్యం సిద్ధంగా వుంది. మరి చూడాలి ఏ పార్టీ పోల్ మేనేజ్ మెంట్ లో సక్సెస్ అవుతుందో.

Related News