Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణాలో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థులు వీరే...

Category : politics

ముందస్తు ఎన్నికల ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ మహాకూటమిలో భాగంగా కాంగ్రస్ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్ధుల్లో తోలి విడతగా 34 మంది అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. అయితే ఈ జాబితాలో అధికశాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కావడం విశేషం. అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ 105 మందితో కూడిన భారీ జాబితాను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాలకు గాను తోలి విడతగా 34 మంది పేర్లను ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.

అయితే పూర్తీ స్థాయి జాబితాను ఈనెల 12 న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మహాకూటమిలో భాగంగా, పొత్తులు, సీట్ల పంపకాల వ్యవహారాలపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో 12న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. అనంతరం పూర్తీ జాబితాను ప్రకటించనుంది.

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థులు వీరే:

సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం

కార్తీక్‌రెడ్డి - రాజేంద్రనగర్‌

రేవంత్‌రెడ్డి - కొడంగల్‌

గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి

కొండా సురేఖ - పరకాల

పొన్నాల లక్ష్మయ్య - జనగామ

కూన శ్రీశైలంగౌడ్ ‌- కుత్బుల్లాపూర్‌

సుధీర్‌రెడ్డి - ఎల్బీనగర్‌

ప్రతాప్‌రెడ్డి - షాద్‌నగర్‌

షబ్బీర్‌ అలీ - కామారెడ్డి

సుదర్శన్‌రెడ్డి - బోదన్‌

శ్రీధర్‌బాబు - మంథని

మహేశ్వర్‌రెడ్డి - నిర్మల్‌

జీవన్‌రెడ్డి - జగిత్యాల

బలరాంనాయక్‌ - మహబూబాబాద్‌

దొంతుమాధవరెడ్డి - నర్సంపేట

గీతారెడ్డి - జహీరాబాద్‌

దామోదర రాజనర్సింహ - ఆందోల్‌

జానారెడ్డి - నాగార్జునసాగర్‌

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - హుజూర్‌నగర్‌

ఉత్తమ్‌ పద్మావతి - కోదాడ

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - నల్గొండ

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - మునుగోడు

సురేష్‌ షెట్కర్‌ - నారాయణ్‌ఖేడ్‌

రమేష్‌ రాథోడ్‌ - ఖానాపూర్‌

పొన్నం ప్రభాకర్‌ - కరీంనగర్‌

సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్‌

వంశీచందర్‌రెడ్డి - కల్వకుర్తి

డీకే అరుణ - గద్వాల

సంపత్‌ - ఆలంపూర్‌

ఆరేపల్లి మోహన్‌ - మానకొండూరు

చిన్నారెడ్డి - వనపర్తి

జగ్గారెడ్డి - సంగారెడ్డి

భట్టి విక్రమార్క - మధిర

Related News