//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కెసిఆర్ నిజమైన రాజకీయ వారసుడు ఎవరో తెలుసా.....!

Category : politics

గడిచిన గత కొన్నిరోజులు గా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు ఊహకందని రీతిలో మారిపోతున్నాయి.తెలంగాణ సీఎం ఒకడుగు ముందుకేసి కేంద్రం పైనే యుద్ధం ప్రకటించాడు. కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేస్తానని చెప్పారు. మూడో కూటమితో కేంద్రంలో జెండా పాతేస్తామని కేసీఆర్ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి థర్డ్ ఫ్రంట్ అని ప్రకటించారో లేదో సోషల్ మీడియాలో అసలు కెసిఆర్ కు తెలంగాణ లో రాజకీయ వారసుడు ఎవరని సర్వేలువచ్చేస్తున్నాయి . తెలంగాణలో కేసీఆర్ రాజకీయ వారసుడనగానే సహజంగా ఎవరైనా కేటీఆర్ వైపే చూస్తారు. కానీ సోషల్ మీడియా దానికి రివర్స్ లో చెబుతుంది.

ఒకవేళ కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలతో బిజీ అయిపోతే రాష్ట్ర రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే సత్తా,తెగువ ఒక్క హరీష్ రావుకు మాత్రమే వుంది అని సోషల్ సర్వేలు చెబుతున్నాయి. ఓవైపు కొడుకు కేటీఆర్ ను కేసీఆర్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తుండగా, మరోవైపు ఇలాంటి ఫలితాలు రావడం అందరిని ఆశ్చర్యనికి గురిచేస్తున్నాయి .

అసలు రాజకీయాల్లో కేటీఆర్ కంటే హరీష్ రావు సీనియర్ నేత. కేసీఆర్ తలపెట్టిన తెలంగాణ ఉద్యమంలో మొదటి నుడి హరీష్ రావు మాత్రమే వున్నాడు. అంతేకాకుండా ఉద్యమంలో కూడా తన ప్రతిభ తో ముందు కు తీసుకుపోయాడు. ఎన్నికల సమయంలో కేసీఆర్, హరీష్ రావుదే హవా సాగింది. తెలంగాణ లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

కెసిఆర్ కూడా కొడుకుకి, మేనల్లుడు ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చాడు. క్రమక్రమంగా తెరాస లో కేటీఆర్ కు ప్రాధాన్యం పెంచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్ని వ్యూహాత్మకంగా కొడుక్కు అప్పగించారు. అక్కడ్నుంచి మున్సిపల్ శాఖ కట్టబెట్టారు. మీడియాలో హరీష్ కంటే కేటీఆర్ కే ఎక్కువ ఫోకస్ వచ్చేలా చేయడంలో కేసీఆర్ నూరు శాతం సక్సెస్ అయ్యారు. అలా తన రాజకీయ వారసుడు కేటీఆర్ అనే ఫీలింగ్ ను పార్టీ శ్రేణుల్లో తీసుకురాగలిగారు.

ఇన్నిపనులు చేసినా సరిగ్గా ఎన్నికల ముందు సోషల్ మీడియాలో హరీష్ రావుకు అనుకూలంగా ఫలితాలు రావడం కేసీఆర్, కేటీఆర్ ను మాత్రమే కాదు టీఆర్ఎస్ శ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ సర్వే లు కేవలం సోషల్ మీడియాలో ఎవరికి వాళ్లు వ్యక్తిగత స్థాయిలో చేసుకున్న సర్వేలు మాత్రమే అని తెలుస్తున్నది.

ఇప్పటివరకు ఏ మీడియా సంస్థ లేదా స్వతంత్ర సంస్థ ఈవిషయం ఫై తెలంగాణలో సర్వే చేయలేదు. ఒకవేళ అలాంటి సర్వే జరిగితే అప్పుడు కెసిఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు ఎవరనేది ఒక అంచనాకు రావచ్చు.