//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపి అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.....ఎందుకంటే

Category : state politics

గత ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలోపేతం అవుతుందని అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఎంత బలహీనంగా మారుతుందని ఎవరు భావించలేదు. ముందస్తు ఎన్నికల ప్రభావం భారతీయ జనతా పార్టీపై బాగా కనిపిస్తుంది. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు సైతం ఓటమిపాలయ్యారు. ఇక తెలంగాణలో ఎన్నికల సమయంలో అమిత్ షా, నరేంద్ర మోడీ వంటి అగ్ర నాయకత్వం కూడా వచ్చి సభల్లో పాల్గొని బీజేపీని గెలిపించాలంటూ ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాత్రం బీజేపీని చావు దెబ్బ కొట్టి గులాబీ పార్టీ కి జై కొట్టారు. ఇక అప్పటినుండి అధిష్టానం సైతం తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం మానేసింది.

అసెంబ్లీ ఎన్నికల తరువాత వెనువెంటనే వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల్లో బిజెపి ఎలాంటి రోజు తీసుకోవడం లేదు. అసలు అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో కూడా లేదు. ఒక పక్క టిఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో దూకుడు చూపిస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ అంతో ఇంతో పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే, బీజేపీ మాత్రం సైలెంట్గా దిక్కులు చూస్తుంది. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబడితే ఒకవేళ వాళ్ళు గెలిచిన పార్టీలో కొనసాగుతారో లేదో అన్న అనుమానం బిజెపి నాయకులకు ఉన్నదట. పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ చేస్తే ఎన్నికల ఖర్చు మినహాయించి వచ్చే ప్రయోజనం లేదని బిజెపి అధినాయకత్వం భావిస్తుందట. ఈ నేపథ్యంలోనే పంచాయితీ ఎన్నికలను పూర్తిగా పక్కన పెట్టేసింది బిజెపి. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నైనా పంచాయతీ ఎన్నికలను ఖర్చుగా భావించకుండా ప్రయత్నం చేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయాన్ని సైతం బీజేపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. అసలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పోటీ లో ఉంటుందా అన్న అనుమానం సైతం సొంత పార్టీ నేతల్లోనే కలుగుతోంది.

టిఆర్ఎస్ లో లోపాయికారి ఒప్పందం చేసుకుంది అన్న అంశంతో అభాసు పాలైన బిజెపి ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ హవా కొనసాగుతుంది అని వివిధ సర్వేల నివేదికలు తేల్చి ఉండటంతో అధిష్టానం తెలంగాణ రాష్ట్రం పైన పూర్తిగా శీతకన్ను వేసింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ అగ్రనేతలు కేంద్రంలోని అధినేతల తీరు పట్ల గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో పార్టీలో ఉండాలా వద్దా అన్న అసహనానికి గురవుతున్నారు.