//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాయ్ రాజా కాయ్ ...తెలంగాణ లో బెట్టింగ్ జోరు ....సుహాసిని, రేవంత్ రెడ్డే టార్గెట్ ....!

Category : politics state

ప్రజాకూటమిలో భాగమైన టీడీపీకి ఎన్ని సీట్లు దక్కు తాయి? కూకట్‌పల్లి నుంచి నందమూరి కుటుంబ వారసురాలు సుహాసిని గెలుస్తుందా? లేదా?.. కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డికి ఎంత ఆధిక్యం రావచ్చు? అన్న అంశాలపైనా భారీగా పందాలు నడుస్తున్నాయి. టీడీపీకి ఐదు స్థానాలకు మించి వస్తాయని ఆ పార్టీ శ్రేణులు జోరుగా పందాలు కడుతున్నారు.

ఆమేరకు అవకాశం లేదని బెట్టింగ్‌ కాసే వారి సంఖ్య తక్కు వగానే కన్పిస్తున్నప్పటికీ టీడీపీకి ఎనిమిది స్థానాలు కూడా రావని బెట్టింగ్‌ పెట్టేందుకు అనేక మంది ముందుకు వస్తు న్నారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని గెలుపుపై నిన్న మొన్నటి వరకూ సాగిన బెట్టింగ్‌ల జోరు శుక్రవారానికి కొంత తగ్గింది. బుధ, గురువారాల్లో ఆ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులను భారీగా కట్టడి చేశారన్న ప్రచారం ఊపందుకుంది.

కొందరు టీడీపీ నాయకుల ఇళ్లపై పోలీసులు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేశారన్న సమాచారం వెల్లడైంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ఒక సామాజికవర్గం వారిని కట్టడి చేశారన్న ప్రచారం కూడా జరి గింది.

ఫలితంగా అక్కడ సుహాసిని ఓటమి ఖాయమన్న దాని పై పందెం కాసేందుకు అనేక మంది ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి సుహాసిని గెలుపునకు అనుకూలంగా బెట్టింగ్‌ కాసే వారి సంఖ్య పెరిగింది. ఇక ప్రముఖుల్లో రేవంత్‌రెడ్డి ఓటమిపై పందాలు కన్పించనప్పటికి ఆయనకు వచ్చే ఆధిక్యంపై మాత్రం బెట్టింగ్‌ జోరుగా నడుస్తోంది.

Related News