//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..!

Category : politics

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంకు గాను బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ పై చర్చ, ఆమోదం లక్ష్యంగా సమావేశాలు జరుగనుండగా, సభ మొదటి రోజు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.

అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాము అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీనిపై చర్చించిన తెరాస నేతలు, సీఎం కెసిఆర్ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే కాంగ్రెస్ నేతలఫై సీరియస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పారు.

అలాగే ఈ సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా హెచ్చరించారు. నేడు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా, ఆపై 12 గంటలకు జరిగే బీఏసీ సమావేశంలో సభా కార్యకలాపాల నిర్వహణ, ఎన్ని రోజుల పాటు సభను జరపాలన్న అంశాలను చర్చించనున్నారు.

Related News