//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ హౌస్‌లో.. చెప్ప‌కూడ‌ని మ్యాట‌ర్ చెప్పేసిన‌ తేజస్వి.. అందుకే క‌ట్ చేశారా..?

Category : movies

తెలుగు బిగ్ బాస్ మొద‌టి సీజ‌న్‌లో.. ఆ షో సమయానికి అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. మొదట్లో ఆ షోని విమర్శించినా.. మెల్లగా అలవాటు పడిపోయారు. ఇక ఇప్పుడు రెండ‌వ సీజ‌న్ మొదలైంది. అయితే కంటెస్టంట్ల ఎంపికలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినా.. రెండు రోజులు తరువాత షోపై ఆడియన్స్‌లో ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ అవుతోంది. దానికి ఉదాహ‌ర‌ణ‌.. బిగ్ బాస్ హౌస్‌లో రెండు రోజులు కంప్లీట్ అయ్యాక అసలైన మాటల యుద్ధం మొద‌లైంది. ఒకర్ని మరొకరు టార్గెట్ చేయడం , కావాలని రెచ్చగొట్టడం ఇవ్వన్నీ మొదలు అయ్యాయి.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజా బిగ్ బాస్ హౌస్‌లో ప్రేక్షకుల ఫోకస్ మాత్రం తేజస్వి ఫై ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్‌లో అప్పుడపుడు కొందరు కెమెరా ఉంటుందని తెలియకుండా వ్యక్తిగత విషయాలను చెప్పేసుకుంటారు. తాజాగా తేజస్వి తన జీవితాన్ని గురించి చెబుతూ తన రెమ్యూనరేషన్ చెప్పేసింది. కాకపోతే ఆ అమౌంట్ దగ్గర బీప్ సౌండ్ పెట్టారు. మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం వచ్చిందని... ఆ తరువాత డబ్బు కోసం జాబ్ చేయాల్సివచ్చిందని... ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసినప్పుడు రోజుకి 12 వేలు మాత్రమే వచ్చేవని... ఆ తరువాత ఎక్కువగా ఆ పని వర్కౌట్ కాక‌పోవ‌డంతో... డైరెక్ట్‌గా మంచి గుర్తింపు ఉన్న అవకాశాల కోసం ట్రై చేయాలనీ జాబ్ వదిలేశానని చెప్పింది. ఇక చివ‌రిగా.. బిగ్ బాస్‌లో ఉన్నందుకు ఇంత ఇస్తున్నారు అంటూ ఆమె తన రెమ్యునరేషన్‌ను చెప్పింది. అయితే ఆ మాటల‌ను బుల్లితెర ప్రేక్ష‌కులు విన‌కుండా బీప్ సౌండ్ వేశేసారు.