//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉద్యోగులకు టెక్ మహీంద్రా భారీ షాక్

Category : national business

ట్రంప్ దెబ్బకు భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులు వణుకుతున్నారు. దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాగా ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరూ ఎవరికి ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందోనన్న భయంతో గడుపుతున్నారు. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ బాటలోనే ఇప్పుడు టెక్ మహీంద్ర కూడా అడుగువేసింది. ఈ ఒక్క నెలలోనే 1,500 మందికి ఈ సంస్థ ఉద్వాసన పలికింది. అయితే ఇది తమ సంస్థలో రెగ్యులర్ గా జరిగేదేనని పనితీరు ఆశించినంతగా లేని ఉద్యోగులను తొలగించడం మామూలేనని ఈ సంస్థ చెప్పింది. ప్రధానంగా 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులనే కంపెనీలు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులకు ఏదో ఒక కారణం చూపి వీరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.