//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హుమాయూన్‌ టోంబ్‌ కూల్చివేయండి

Category : national

దేశ రాజధానిలో ముస్లింల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్మశాన వాటికలు సరిపోనందున హుమాయూన్‌ టోంబ్‌ను కూల్చివేసి దానిని ముస్లింల కోసం స్మశాన వాటికగా మార్చాలని షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు కోరింది. వక్ఫ్‌ బోర్డు అధ్యక్షుడు వసీమ్‌ రిజ్వి ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. హుమాయూన్‌ టోంబ్‌ను కూల్చివేసి దానిని ముస్లింలకు స్మశానవాటికగా మారిస్తే సమస్య పరిష్కారమవుతుందని రిజ్వి తన లేఖలో పేర్కొన్నారు. ఆల్‌ ఇండియా రబ్తా ఉ ఎ ఉ మజీద్‌, యమునా విహార్‌కు చెందిన మదారిస్‌ ఉ ఎ ఉ ఇస్లామియాలు దేశ రాజధానిలో ముస్లింలకు స్మశాన వాటిక స్థలం కొరతను వివరిస్తూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు దృష్టికి తీసుకువచ్చాయి.ఈ నేపథ్యంలో స్మశాన వాటిక కోసం హుమాయూన్‌ టోంబ్‌ను కూల్చివేయాలని బోర్డు ప్రధానికి విజ్ఞప్తి చేసింది.