//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీమిండియాదే నిదహస్‌ ట్రోఫీ...!

Category : sports

శ్రీలంక 70వ స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా నిర్వహించిన నిదహాస్‌ ట్రోఫీని టీం ఇండియా సొంతం చేసుకున్నది. ఈ సిరీస్ మొదట్లో శ్రీలంక తో ఓటమిని చుసిన, తరువాత పుంజుకొని బంగ్లాదేశ్ ఫై వరుస విజయాలతో ఫైనల్ కు పోయింది.

ఈ సిరీస్ లో హాట్ ఫేవెరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా సిరీ్‌సకు అసాధారణ ముగింపునిచ్చింది. దినేశ్‌ కార్తీక్‌ 8 బంతుల్లో 29 నాటౌట్, హీరోచిత బ్యాటింగ్‌తో నిదహాస్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఆదివారం రాత్రి ఆఖరి బంతి వరకూ అత్యంత హోరాహోరీగా సాగిన తుదిపోరులో భారత్‌ 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

బంగ్లా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని రోహిత్‌సేన ఆరు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. రోహిత్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, మనీష్‌ పాండే (28), లోకేశ్‌ రాహుల్‌ (24) సత్తా చాటారు. దినేశ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా వాషింగ్టన్‌ సుందర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు గెలుచుకున్నాడు