వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వన్డేల్లో ఎక్కువసార్లు 300, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన టీమ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ సేన 300కుపైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో 300కుపైగా స్కోరు చేయడం టీమిండియాకు ఇది 96వ సారి.
దీంతో ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా (95 సార్లు) పేరుతో ఉన్న రికార్డు మరుగున పడిపోయింది. వన్డేల్లో 90 సార్లకుపైగా 300 స్కోర్లు అందుకున్న టీమ్స్ ఇండియా, ఆస్ట్రేలియా మాత్రమే. మూడోస్థానంలో సౌతాఫ్రికా (77) ఉంది. 96 సార్లు 300కుపైగా స్కోర్లు చేయగా అందులో ఇండియా 75సార్లు గెలిచింది. 19 సార్లు ఓటమి చెందగా, రెండు మ్యాచ్‌లు టై అయ్యాయి. అయితే ఎక్కువసార్లు ఓడిన టీమ్ రికార్డు కూడా ఇండియా పేరిటే ఉంది.
ఇక 350 నుంచి 400 మధ్య, 400కుపైగా స్కోర్లు చేయడంలో ఇండియా రెండోస్థానంలో ఉంది. ఈ రెండు జాబితాల్లో సౌతాఫ్రికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 350 నుంచి 400 మధ్య స్కోరును ఇండియా 23 సార్లు అందుకుంది. 400కుపైగా స్కోర్లను 5సార్లు చేసింది టీమిండియా.
వన్డేల్లో భారత్ తొలిసారి 300కుపైగా స్కోరును 1996లో షార్జాలో పాకిస్థాన్‌పై అందుకుంది. ఆ మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్లకు 305 రన్స్ చేసింది. ఇక 350కిపైగా తొలిసారి 1999 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై, 400కుపైగా స్కోరును తొలిసారి 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాపై టీమిండియా అందుకుంది.