//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కుర్ర హీరోయిన్ తో ప్రేమలో టీం ఇండియా ఆటగాడు

Category : sports

టీం ఇండియా ఆటగాడు కెఎల్ రాహుల్ ప్రేమలో పడ్డాడు. బాలివుడ్ యువ హీరోయిన్ నిధి అగర్వాల్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు.తాజాగా వీళ్లిద్దరూ కలిసి ముంబయిలోని ఒక రెస్టారెంట్లో విందు చేస్తూ మీడియాకు దొరికిపోయారు. వీరి మధ్య కొన్ని రోజుల కిందటే ప్రేమ చిగురించినట్లు చెబుతున్నారు. నిధి ప్రస్తుతం తెలుగులో అక్కినేని నాగచైతన్యతో ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తోంది. అఖిల్‌ కొత్త సినిమాలోనూ ఆమే కథానాయిక.

ఇదిలా ఉంటె టీం ఇండియా ఆటగాళ్ళు బాలివుడ్ హీరోయిన్లతో ప్రేమాయణాలు నడపడం కొత్తేం కాదు. గతంలో యువరాజ్ సింగ్, ధోని.. వంటి వాళ్ళు బాలివుడ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే అది పెళ్లి వరకు వెళ్ళలేదు. ఇటీవల కోహ్లి బాలివుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి రాహుల్ పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి.

Related News