Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత హైకమిషన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన టీమ్ ఇండియా క్రికెటర్లు..

Category : sports

టీమ్ ఇండియా క్రికెటర్లు లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు భారత హైకమిషన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించింది. ఈ కార్యక్రమానికి టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఇతర సిబ్బంది, క్రికెటర్లు పాల్గొన్నారు.

వీరితోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా వెళ్లింది. అనంతరం కార్యాలయ భారత హైకమిషనర్, సిబ్బందితో ఫొటోలు దిగారు. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో గురువారం లార్డ్స్ వేదికగా ఆరంభంకానున్న రెండో టెస్టులో కోహ్లీసేన తలపడనుంది.