టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త రికార్డు అందుకున్నాడు. టెస్టుల్లో 2 వేల పరుగులు, 250 వికెట్లు అత్యంత వేగంగా అందుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన అశ్విన్ ఈ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
51వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ కెరీర్లో 11 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు చేశాడు. ఇక టెస్టుల్లో 2 వేల పరుగులు, 250 వికెట్లు తీసుకున్న నాలుగో భారత ప్లేయర్‌గా అతడు నిలిచాడు. కపిల్ దేవ్, హర్భజన్‌సింగ్, అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్ ప్లేయర్ అశ్విన్.
అంతేకాదు వరల్డ్ క్రికెట్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు అత్యంత వేగంగా అందుకున్న వారిలో అశ్విన్ స్థానం నాలుగు. ఇయాన్ బోథమ్, ఇమ్రాన్ ఖాన్, కపిల్ దేవ్ తర్వాత అశ్విన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 52 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇలా ఉండగా, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది టీమిండియా 9 వికెట్లకు 622 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చెతేశ్వర్ పుజారా (133), రహానే (132) సెంచరీలకు తోడు జడేజా (70 నాటౌట్), సాహా (67), కేఎల్ రాహుల్ (57), అశ్విన్ (54)లు హాఫ్ సెంచరీలు చేశారు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 600 చేసిన భారత్ ఇప్పుడు ఆ స్కోరును మించి సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌పైనా కోహ్లి సేన పట్టు బిగించినట్లే. లంక బౌలర్లలో హెరాత్ 4, పుష్పకుమార 2 వికెట్లు తీసుకున్నారు.