Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుజరాత్లో టీచర్ల మహా ధర్నా

Posted 3 months ago | Category : national

ప్రభుత్వ వ్యతిరేక నిరసన సెగలు బీజేపీ పాలిత గుజరాత్‌ సర్కారును గుక్కతిప్పుకోనీయటంలేదు. జీఎస్టీ అమలు చేశాక సూరత్‌ వస్త్రవ్యాపారులు నిరంతరం ఆందోళనలు కొనసాగించారు. భారీ ప్రదర్శనలు,ధర్నాలు నిర్వహించారు. తాజాగా బ్లాక్‌ బోర్డుపై పాఠాలు చెప్పే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు కూడా రోడ్డెక్కారు.ఊహించని విధంగా సెలవుదినం రోజైన ఆదివారం భారీగా తరలివచ్చి,మహాధర్నా నిర్వహించారు. ఇలాంటి ఆందోళనలు గుజరాత్‌ ఎన్నికల్లో ఎక్కడ కొంపముంచుతాయోనన్న భయం అక్కడి అధికారపార్టీ నేతలను వెంటాడుతోంది.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మహా ధర్నా నిర్వహించారు. ఏరడ్ల నుంచి తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగుతున్నామని, బీజేపీ సర్కారు పర్మినెంట్‌ చేసే విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సెలవుదినం కావటంతో, ఆ సమయాన్ని విరామం తీసుకోకుండా ఉపాధ్యాయులు కదలివచ్చారు. అహ్మదాబాద్‌, గాంధీనగర్‌తోపాటు ప్రధాన నగరాల్లో టీచర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఏకమై గళమెత్తారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినదించారు. అహ్మదాబాద్‌లోని ముఖ్యకూడలి ప్రాంతాలతో పాటు కీలక ప్రాంతాలన్నీ టీచర్ల ప్రదర్శనలతో కిటకిటలాడాయి. ప్రధాన మార్గాలలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

పోలీసులు బందోబస్తుగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల నిరనస ప్రదర్శనకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.గతంలో జీఎస్టీకి వ్యతిరేకంగా సూరత్‌ వస్త్ర వ్యాపారులపై ఖాకీల దౌర్జన్యం చేసిన విదితమే. ఓవైపు గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం..మరోవైపు గుజరాత్‌ వికాస్‌ పేరుతో ప్రధాని మోడీ గుజరాత్‌ పర్యటనకు వస్తున్న కొన్ని గంటలకు ముందు ఉపాధ్యాయులు ప్రదర్శనకు దిగటం బీజేపీ పాలిత గుజరాత్‌ సర్కారుకు ముచ్చెమటలు పట్టాయి. గుజరాత్‌కు ముఖ్యమంత్రులు మారినా తమ తల రాతలు మారలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

1997 నుంచి తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు దిగ్విజరుసింగ్‌ జడేజా తెలిపారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించకపోవటంతో పాటు..ఇచ్చే కొద్దిపాటి వేతనాలు సక్రమంగా ఇవ్వటంలేదని ఆయన చెప్పారు. రెండు రోజుల కిందట నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. అయితే ఆదివారం ఉపాధ్యాయ సంఘాల మహా ధర్నా పిలువునందుకున్న టీచర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ఈ మహా కదలికే తమ డిమాండ్ల సాధనకు ఉపయోగపడబోతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి