Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీకి 120 సీట్లు ఖాయం

Category : politics state

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి 120 సీట్లు రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రులను కుక్కలు అని వ్యాఖ్యానించిన కేసీఆర్‌తో వైఎస్‌ జగన్‌ జతకట్టడం సిగ్గుచేటని మండి పడ్డారు. ఆదివారం కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌తో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో జగన్‌ జోరు తగ్గిందని, సైకిల్‌ స్పీడ్‌ పెరిగిందని అన్నారు. వైసీపీ.. బీజేపీలో భాగమేనన్నారు. వైసీపీ డైరెక్టర్‌, నిర్మాత మోదీ అని బైరెడ్డి అన్నారు. ఎస్వీ మోహన్‌రెడ్డి షేర్‌ మార్కెట్‌ తరహాలో పార్టీలు మారుతుంటారని ఎద్దేవా చేశారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌లో జగన్‌ ఫెయిల్‌ అయ్యారన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ఎన్నికల్లో వైసీపీ డీలా పడిపోయిందని బైరెడ్డి చెప్పారు.

Related News