//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశాన్ని కుదిపేస్తున్న టీడీపీ సంచలన నిర్ణయం....!

Category : national politics

దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక చర్చ జరుగుతుంది. అది ఏమిటిఅంటే రేపటి నుండి ప్రారంభంకాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ అవిశ్వాసం పెట్టబోతుందని ఇప్పటికే చెప్పేసింది. కాబట్టి ఇప్పటికే ఈ విషయం పై దేశం లోని అన్ని రాజకీయ పార్టీలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.

గత నాలుగు సంవత్సరాలు బీజేపీ లో కొనసాగిన టీడీపీ, అనుకోని కారణాలతో బీజేపీ నుండి వైదొలగి, డైరెక్ట్ గా బీజేపీ సర్కార్ పైన్ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టబోతుంది. పోయిన సమావేశాల్లో అవిశ్వాసం పెట్టిన కూడా బీజేపీ ప్రభుత్వం అది చర్చకు రాకుండా చూసింది. కానీ ఈసారి ఆలా కాకుండా ఎలాగైనా చర్చకు తీసుకువచ్చేలా చేయాలనీ టీడీపీ ప్రభుత్వం చూస్తుంది.

దీనికి కావలిసిన మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. టీడీపీ కి ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం, డీఎంకే ఇంకా కొన్ని పార్టీ లు మద్దతును ప్రకటించాయి. దీనితో ఇప్పుడు బీజేపీ సర్కారులో వణుకుమొదలయింది అని అనుకుంటున్నారు...చూడాలి మరి రేపటినుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి..టీడీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో......

Related News