//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలో కి టీడీపీ సీనియర్ నేత..?

Category : politics

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ పడుతున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీలకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి నాయకులూ జంప్ అవుతున్నారు. అసలే తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుతున్న నేప‌థ్యంలో ఆవేడి ఇప్పుడు ఏపీ కి కూడా తాకింది. అందుకే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు కొందరు నాయకులూ.

గతం లో అత్య‌ధిక మెజార్టీతో గెలిచిన కొందరు నాయకులకు ఓటమి భయంపట్టుకుంది. అందులో కొంతమంది నియోజకవర్గం మార్చుకుంటుంటే, మరికొంత మంది వేరే పార్టీలలోకి జంప్ చేస్తున్నారు. ఈ కోవలోనే ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ నియోజ‌క‌వ‌ర్గం మార‌డంలో ముంద‌జలో ఉన్నార‌ట‌.

మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌కు శిష్యుడైన ఆమంచికి చీరాలలో ప్రజల సపోర్ట్ బాగానేవుంది. అయితే 2009లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల టైం లో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితమైన సంగతి తెలిసిందే. ఆటైంలో న‌వోద‌య పార్టీ స్థాపించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. ఆతరువాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వరస హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆమంచి కృష్ణ మోహన్ ఇప్పుడు వైసీపీ లో చేరుతున్నట్టు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ కి వ్యతిరేఖత వస్తుందన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కానీ జనసేనలో చేరాలా లేక వైసీపీ లో చేరాలా అని, చివరికి వైసీపీ లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నిజమే అన్నట్లు వైసీపీ నేత జగన్ తో రహస్య భేటీ కూడా జరిగిందని సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న అధికార టీడీపీ నేతలు ఆమంచిని పార్టీనుంచి పోనియ్య‌కుండా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ విషయం చంద్రబాబు దృషికి వెళ్లడంతో ఆయనని స‌చివాలయానికి పిలిపించుకుని ఆరా తీశార‌ట. కానీ ఆమంచి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. ప్రజలకి మంచి చేస్తే ఏ పార్టీనుంచి పోటీచేసిన గెలుపు ఖాయమని, ఇలా పార్టీలు మారాలిసిన పనిలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News