//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ టికెట్స్ ల రేసులో గెలవనున్న రమేష్, రామయ్య..!

Category : politics

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న రాజ్యసభ టికెట్ రేసులో సీఎం రమేష్, వర్ల రామయ్య విజేతగా నిలవనున్నారు. చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి వీరికి పార్టీ టికెట్ ఇవ్వనున్నారు. వీరిని దాదాపు రాజసభ్య అభ్యర్థులుగా పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మధ్యాహ్నం అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్న సీఎం రమేష్ ను రాజ్యసభలో కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీనియర్ నేత వర్ల రామయ్యకు ఎస్సీ కోటాలో అవకాశం ఇచ్చారు.

టికెట్ రేసులో పలువురు నేతలు ప్రయత్నించినప్పటికీ చివరకు వీరిద్దరికీ అవకాశం కల్పించనుంది. టీడీపీ ఏపీ అధ్యక్షడు కళా వెంకట్రావు, ఆర్థికమంత్రి యనమలతో భేటీ అయిన అనంతరం చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చారు. కాసేపట్లో అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప వీరిద్దరి పేర్లు దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు.