Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

Category : politics state

రోడ్‌షోలు, సభలతో అందరి కంటే ప్రచారంలో ముందున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు విరామం లేకుండా ప్రచారం చేస్తూ టీడీపీ అభ్యర్ధుల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. నేడు కూడా విరామం లేకుండా పలు జిల్లాలను చుట్టేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రచారానికి మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో ప్రచారంలో స్పీడ్‌ పెంచారు.

ఇవాళ కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ మూడు జిల్లాల్లో దాదాపు 6 సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నందిగామలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు నర్సాపూర్‌లో బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 15నిమిషాలకు తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో పరిధిలో జరిగే సభలకు చంద్రబాబు హాజరవుతారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు పెద్దాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు పిఠాపురంలో బహిరంగ సభ చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడ రూరల్‌లో రోడ్‌ షోలో నిర్వహిస్తారు టీడీపీ అధినేత.

మరోవైపు ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు…జగన్‌, మోదీ, కేసీఆర్‌ల తీరుపై ధ్వజమెత్తారు. ప్రతి సభలోనూ ఈ ముగ్గురి తీరును ఎండగడుతున్నారు. రాష్ట్రంపై మోదీ కక్ష గట్టారని మండిపడ్డ టీడీపీ అధినేత…ఆంధ్రులతో పెట్టుకున్నవారు ఎవరు బాగుపడలేదన్నారు. అధికారులను దారుణంగా బదిలీ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News