//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దూకుడు పెంచిన సైకిల్

Category : politics

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ప్రజల్లోకి వెళ్ళడానికి గాను సైకిల్ యాత్రలను చెయ్యాలని భావిస్తుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం అన్యాయం చేసింది అనే కారణంతో దశల వారిగా పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తొలుత మంత్రులను ఉపసంహరించుకుని అనంతరం ఎన్డియే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఎంపీలు పోరాటమే మార్గంగా ప్రధాని టార్గెట్ గా నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

పార్లమెంట్ లో ప్రధాని సీటు నుంచి ప్రధాని ఇంటి వరకు నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు ప్రస్తుతం ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు వచ్చేశారు. ఇక ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్లి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు వారికి ఒక ప్రణాళిక కూడా ఇచ్చినట్టు సమాచారంఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి చంద్రబాబుకి ఇదే సలహా ఇచ్చినట్టు సమాచారం.

తొలుత ఎంపీలు బస్సు యాత్రలను చెయ్యాలి అని భావించినా ప్రజల్లోకి వెళ్లి సమస్యను స్పష్టంగా వివరించాలి అంటే సైకిల్ యాత్రాలే మేలని ఆయన చంద్రబాబుకి సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సైకిల్ యాత్రల విషయంలో ఎంపీల అభిప్రాయాన్ని కూడా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో ఎక్కువగా యాత్రలు చెయ్యాలని వారు భావిస్తున్నట్టు సమాచారం.

Related News