//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీల నిరసన

Category : politics

ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయానికి తెలుగు రాష్టాల ఎంపీ లు గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో నిరసన లు చేస్తున్నారు.ఈ రోజు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన నిర్వహించారు.

విభజన హామీలు నెరవేర్చాలంటూ గత మూడు రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంటు బయట, లోపల ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేటితో పార్లమెంటు బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగుస్తున్నందున ఆందోళన మరింత ఉధృతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచన మేరకు ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు.

ఈసందర్బంగా ఎంపీ లు అందరూ సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఇదిలా ఉండగా టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న వేషాధారణతో ఆందోళనలో పాల్గొన్నారు. లోక్ సభ లో కూడా నిరసన ల పర్వం కొనసాగుతుంది.