//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోనియాను కలిసిన టీడీపీ ఎంపీలు..!

Category : politics

తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు గురువారం లోక్‌సభలో సోనియా గాంధీ, జ్యోతిరాదిత్యలను కలిసారు. వారితో కొద్ది సేపు మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వారికి వివరించారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

కాగా వాయిదా పడిన లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. మిత్రపక్షాలకే న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎవరు పోటీ చేస్తారని టీడీపీ ఎంపీలు ప్రశ్నించారు. పటేల్‌ గురించి ప్రధాని నరేంద్రమోదీ సభలో మాట్లాడుతుండగా ఆయన ఎలా పనిచేశారో గుర్తించాలని టీడీపీ ఎంపీలు అన్నారు.

కాగా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఐదో రోజు గురువారం పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన కొనసాగుతోంది. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ ఆందోళన విరమించేది లేదని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు.