//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగిన టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్...!

Category : politics

పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పై మాట్లాడిన టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ కేంద్ర సర్కార్, ప్రధానమంత్రి పై నిప్పులు చెరిగారు. మాకు చెప్పిన హామీలని ఎవరు నిరవేర్చుతారు అని అయన అడిగారు. అయన 12 నిమిషాలపాటు మాట్లాడిన ప్రసంగం మొత్తం హిందీలో నిరంతకుటంగా కొనసాగింది.

మీరు చెప్పినవన్నీ అబద్ధాలే’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖంమీదే చెప్పారు. ‘ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు’ అని పలుమార్లు బల్ల గుద్ది మరీ చెప్పారు.హామీలు అమలు చేయాలంటూ మీ చుట్టూ తిరిగారు. చట్టం అమలు చేయాల్సిన బాధ్యత హోం మంత్రి రాజ్‌నాథ్‌ది. ప్రధానికీ దీనిపై బాధ్యత ఉంది. కానీ.. ఈ నాలుగేళ్లలో దీనిపై ఒక్కసారైనా సమీక్ష సమావేశం నిర్వహించారా? సమీక్ష పెట్టి ఉంటే అసలు వాస్తవాలు మీకు తెలిసేవి’ అని మోదీ, రాజ్‌నాథ్‌లకు చురకలంటించారు.

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రస్తావన ఎందుకు, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని రామ్మోహన్‌నాయుడు సూచించారు. ‘విభజన సమయంలో నవ్యాంధ్రకు అన్యాయం జరుగుతోందని గ్రహించి.. నాటి ప్రధాని మన్మోహన్‌ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారు. ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా ఇవ్వాలని రాజ్యసభలో వెంకయ్య, జైట్లీ కోరారు. ఇప్పుడు మీరే ప్రభుత్వంలోకి వచ్చారు. మోదీ ప్రధాని అయ్యారు. ఇప్పుడేమో హోదా అంశం చట్టంలో లేదంటున్నారు.

విభజన చట్టంలోని ఒక్కటంటే ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని రామ్మోహన్‌ తెలిపారు. ఇంత అన్యాయం జరిగింది కాబట్టే ఆవేశం, ఆక్రోశంతో మాట్లాడాల్సి వస్తోందన్నారు. ‘మేం ఉన్నది 15 మంది ఎంపీలం. ఎంతమంది మద్దతిస్తారో కూడా మాకు తెలియదు. కానీ ఏపీ గురించి ప్రధాని ఏమనుకుంటున్నారు.. ఆయన మనసులో ఏముందో చెప్పాలి.. అందుకే అవిశ్వాసం ప్రవేశపెట్టాం’ అని తెలిపారు.