Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ లో ఎంపీ టికెట్ల కేటాయింపు ... ఎవరెక్కడో

Category : state politics

ఇటు పార్లమెంట్ కీ టికెట్ల కేటాయింపు పెద్ద ప్రహసనంలా మారింది. ఇక అభ్యర్థుల ఎంపిక అనఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అటు అసెంబ్లీకి ,్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది. అన్ని పార్టీల్లోనూ అభ్యర్థుల మార్పులు చేర్పులూ జరుగుతున్నాయి. అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలోనూ అభ్యర్థుల ఎంపిక చాలా కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు టీడీపీ నుడి 30 నుంచి 40 అసెంబ్లీ సీట్లతో పాటు కొన్ని లోక్‌సభ సీట్లలో అభ్యర్థులను మార్చనున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు.

ఇక కొన్ని చోట్ల సిట్టింగ్‌ ఎంపీలపై ఉన్న వ్యతిరేఖత, కొన్ని చోట్ల వయోభారంతో సీనియర్లు రాజకీయాలకు దూరం అవ్వాలని భావించటం , మరికొన్ని చోట్ల సామాజిక, ఇత‌ర‌త్రా సమీకరణల నేపథ్యంలో టీడీపీ నుంచి కొత్త లోక్‌సభ అభ్యర్థులను ఎంపిక చెయ్యనున్నారు. అంతే కాదు ఏపీలో సిట్టింగ్‌ ఎంపీల్లో కొందరు 2019లో పోటీ చేసేందుకు విముఖ‌త వ్యక్తం చేస్తుంటే ఇక కొందరు సీటు దక్కించుకోవడమే పనిగా పెట్టుకుని చంద్రబాబు చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఇక ఏజ్ బార్ అయ్యి రాజకీయాల నుండి వైదొలిగే నాయకులను గమనిస్తే వారిలో రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, అనంతపురం ఎంపీ జేసీ. దివాకర్‌ రెడ్డి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ ఈసారి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే దాఖలాలు కనిపించటం లేదు.ఇప్పటికే వయోభారంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. మోకాలి శ‌స్త్ర‌ చికిత్స తర్వాత ఆయన మునుపటిలా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన రాజకీయ వారసురాలిగా మాగంటి రూపను బరిలోకి దించాలని చూస్తున్నారు. అయితే ఆమెకు ఎంపీ సీటు ఇస్తారా లేదా గుడివాడ నుండి కొడాలి నానీ మీద పోటీకి దింపుతారా అన్నది తెలియాల్సి వుంది. ప్రస్తుతానికి రూపాదేవి పార్టీ తరపున రాష్ట్ర కార్యక్రమాల్లో చురుకుగా దూసుకుపోతున్నారు. ఇక నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా వయో భారంతో పోటీ చేసే అవకాశం అంతంత మాత్రంగా కనిపిస్తుంది . ఇక ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు రాయపాటి సైతం సుధీర్ఘ‌కాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి . ఇప్పుడు ఆయన ఆయన కుమారుడైన రాయపాటి రంగారావును ఎన్నికల బరిలోకి దించాలని చూస్తున్నారు. కానీ చంద్రబాబు రాయపాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.

ఇక ఆయనకు కాకుంటే ఎంపీ అభ్యర్థి రేసులో ఆయన కుమారుడు రాయపాటి రంగారావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక గుంటూరు జిల్లాలో ఉన్న సమీకరణల‌ను బట్టీ రంగారావు అసెంబ్లీకి అయినా పోటీ చేసే అవకాశం వుంది. రాయపాటి వారసుడికి సీటు విషయంలో చంద్రబాబు ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటారన్నదే ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఇక అనంతపురం ఫైర్ బ్రాండ్ ఎంపీ జేసీ. దివాకర్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని తన కుమారుడు జేసీ. పవన్‌ కుమార్‌ రెడ్డికి సీటు ఇవ్వాలని బాబును కోరుతున్నారు కానీ బాబు ఈసారి ఎన్నికలు చాలా కీలకం అని అందుకే జేసీ ని పోటీ చెయ్యమని చెప్తున్నారు. ఇక జేసీ తనయుడు పవన్ పవన్ కుమార్ రెడ్డి రాజకీయ భవితవ్యం తనకు విడిచి పెట్టమని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కు అక్కడ టికెట్ ఇస్తానని చంద్రబాబు రేణుక వైసీపీ నుండి పార్టీ మారిన సమయంలో చెప్పారు. కానీ ఇక్కడ మరో సమస్య వచ్చి పడింది. కాంగ్రెస్, టీడీపీ పొత్తులలో భాగంగా కర్నూలు సీటు కాంగ్రెస్ కోరే అవకాశం వుంది. ఒకవేళ అదే గనుక జరిగితే అక్కడ నుండి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేసే అవకాశం వుంది. కాబట్టి ఈ సీటు డైలమా లో ఉంది. ఇక విజయనగరం ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌ గజపతిరాజు తిరిగి ఎంపీగా పోటీ చేస్తారా ? లేదా విజయనగరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా ? అన్నది కూడా తెలియాల్సి వుంది. అశోక్‌ అసెంబ్లీకి పోటీ చేస్తే బొబ్బిలి ఎమ్మెల్యే సోదరుడు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బేబి నాయ‌న ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా రేసులో ఉండొచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ సీటు కోసం పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త దేవీప్రసాద్‌ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆయనకు సీటు ఇస్తారో లేదో తెలియాల్సి వుంది. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప సైతం ఈ సారి పెనుగొండ నుంచి తనకు అసెంబ్లీ సీటు కావాలని పట్టు పడుతున్నారు. అయితే చంద్రబాబు అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బీకే. పార్థసారధిని తప్పించరు. ఇక స్థాన మార్పుల నేపధ్యంలో చంద్రబాబు సీట్ల సర్దుబాటు చెయ్యటానికి కసరత్తు చేస్తున్నారు. ఇక చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌పై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు.ఆయన తీరు చంద్రబాబు కు నచ్చటం లేదు . పార్టీపైనే బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన శివప్రసాద్‌ ను ఈసారి చంద్రబాబు పక్కన పెట్టినా పెడతారు అని చర్చ సాగుతుంది. ఏపీలో ప్రస్తుతం టీడీపీ లో ౩౦ నుండి 40 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల అలాగే ఇంకొందరు ఎంపీ అభ్యర్థుల టికెట్ల అంశం టీడీపీ కి తలనొప్పిగా తయారైంది.

Related News