//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల లిస్ట్‌..!

Category : state politics

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు మాత్రం ఒక లిస్టును త‌యారు చేశార‌నే ప్ర‌చారం ఇటీవ‌ల కాలంలో జోరుగా కొన‌సాగుతోంది. ఈ లిస్టు ప్ర‌కారం త‌మ‌కు సీట్లు ఇవ్వాల‌ని టీడీపీ కోరుతుంద‌ట‌. టీడీపీ, ఇత‌ర వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం టీడీపీ కోరే సీట్లు ఇవేన‌ని తెలుస్తుంది.

ఉమ్మ‌డి జిల్లాల ప్ర‌కారం మ‌హా కూట‌మిలో భాగంగా టీడీపీ పోటీ చేయాల‌నుకున్న స్థానాల అభ్య‌ర్థుల వివ‌రాలు ఇవే..

దేవ‌ర‌క‌ద్ర‌లో రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, మ‌క్త‌ల్‌లో కొత్త‌గూడ ద‌యాక‌ర్‌రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో చంద్ర‌శేఖ‌ర్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఎం.భూపాల్‌రెడ్డి, శేర్లింగంప‌ల్లిలో మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు, కూక‌ట్‌ప‌ల్లిలో మందాడి శ్రీ‌నివాస‌రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఎం.ఎస్ శ్రీనివాస‌రావు, సికింద్రాబాద్‌లో కూన వెంక‌టేష్‌గౌడ్‌, ఉప్ప‌ల్‌లో వీరేంద్ర‌గౌడ్, ఖైర‌తాబాద్‌లో బీఎన్‌రెడ్డి, కోరుట్ల‌లో ఎల్‌.ర‌మ‌ణ‌, హుజూరాబాద్‌లో ఎన‌గ‌ల పెద్దిరెడ్డి, ఆర్మూర్‌లో ఏలేటి అన్న‌పూర్ణ‌, ప‌ర‌కాల లేదా వ‌రంగ‌ల్ వెస్ట్ రేవూరి ప్ర‌కాష్‌రెడ్డికి, ఆలేరు శోభారాణి, కోదాడ బెల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌, మిర్యాల‌గూడ‌లో శ్రీ‌నివాస్‌, ఖ‌మ్మం నామా నాగేశ్వ‌ర‌రావు, స‌త్తుప‌ల్లి సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు ఇస్తున్న‌ట్టు తెలుస్తుంది. టీడీపీ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం పైన పేర్కొన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీకి వ‌చ్చిన‌ట్టే భావించాలి.

Related News