//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం... రీజన్ అదే

Category : politics state

ఏపీలో ఎన్నిక‌లు దగ్గరపడుతున్న తరుణంలో ఇప్పటినుండే ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తం అవుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక‌ల‌కు మ‌రో ఐదు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో పార్టీల‌న్నీ గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. పార్టీల నేత‌లు కూడా గెలుపు కోసం శ్ర‌మిస్తున్నారు. ఒక పక్క పార్టీల అధినేతలు సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను నిర్ణయిస్తుంటే కొంత మంది నేతలు ఇప్పటి నుండే ప్రజల్లో ఉండేందుకు తగిన సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇప్ప‌టి నుంచే ప్రజాక్షేత్రం లో ఉండాలని భావించి ఇంటింటికి తిరుగుతూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు. ఇప్ప‌టికే గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్ర‌మంలో భాగంగా టీడీపీ నేత‌లు ప్ర‌తిగ్రామంలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌భుత్వ సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రజలకి చెప్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. గ‌త నాలుగేళ్లల్లో చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలియ‌జేస్తూ.. రానున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఓటు వేసి గెలిపించాల‌ని కోరుతున్నారు టీడీపీ నేత‌లు. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే ల పనితీరుపై చాలా ఆరోపణలు ఉన్న నేపధ్యంలో పని తీరు మెరుగుపరచుకునే పనిలో పడ్డారు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు . తీరా సమయానికి కాకుండా ఇప్పటి నుండే ప్రజా క్షేత్రంలో ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు.

విశాఖ‌ప‌ట్నం జిల్లాకు చెందిన అధికార పార్టీ కి చెందిన పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నారు. తమ నియోజక వర్గ ప్రజల సమస్యలను తెలుసుకోవాలని భావిస్తున్న అనిత నియోజ‌క‌వ‌ర్గం మొత్తం పాద‌యాత్ర చేయాల‌ని సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. మీ కోసం-మీ ఆడపడుచు కార్యక్రమం పేరుతో తానూ అందరి వద్దకు రానున్నట్టు ప్రకటించారు. గ‌త నాలుగేళ్ల‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రజలకు వివరించటం తో పాటు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకే పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు అనిత ప్ర‌క‌టించారు. ఈ నెల 24వ తేదీ నుంచి పాద‌యాత్ర కు శ్రీకారం చుట్టనున్నట్టు ఆమె తెలిపారు. . నాలుగు మండలాల్లోని 80 పంచాయతీల్లో సుమారు 250 కిలోమీటర్ల మేర పాద‌యాత్ర చేపడతానని అనిత సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు.

పాయ‌క‌రావుపేట టీడీపీ కార్యాలయంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన అనిత‌, పాద‌యాత్ర గురించి వివరించారు. తానూ ఎక్కడ పాదయాత్ర ప్రారంభించి ఎక్కడ వరకు ఎండ్ చేయ్యనున్నారో చెప్పారు. ప్రజలతో మమేకం అవ్వటానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని అనిత చెప్పుకొచ్చారు. 24వ తేదీన పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్లు తెలిపిన ఆమె, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా గ‌త నాలుగేళ్లుగా చేసిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తాన‌న్నారు. సీఎం చంద్ర‌బాబు స‌హ‌కారంతో గ‌త నాలుగేళ్ల‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్న‌డూ లేనంత అభివృద్ధి జ‌రిగింద‌ని తెలిపారు. పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌తిగ్రామంలో ప‌ర్య‌టించి టీడీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి తెలియజేస్తానన్నారు. మొత్తానికి ఎన్నికల వాతావరణం ఏపీలో కూడా వేడేక్కింది. ఇప్పటినుండే అభ్యర్థులు ప్రజల మెప్పు కోసం తిప్పలు పడుతున్నారు. ఇక అనిత మాత్రం పాదయాత్ర తో ప్రజల దగ్గర మార్కులు కొట్టేస్తా అంటున్నారు.

Related News