Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలో సన్నగిల్లిన ఆశలు..ఈ టీడీపీ నేత గెలుపు ఖాయం ......

Category : state politics

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు గెలుపు దాదాపు సాధ్యం అయినట్లేనని రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చ న‌డుస్తుంది . దీంతో రాయదుర్గం పట్టణంపై వైసీపీలోను ఆశలు సన్నగిల్లుతున్న‌ట్లు స‌మాచారం . తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి వెన్నంటిగా నిలిచే రాయదుర్గం పట్టణమే ఈ సారి మళ్లీ కాలవ శ్రీనివాసులును గెలుపిస్తుంద‌ని పార్టీ శ్రేణులు పూర్తి న‌మ్మ‌కంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది . ప్ర‌స్తుతం ఈ నియోజ‌క వ‌ర్గంలో 2,49,553 ఓట్లు ఉండగా అందులో 2,15,507 ఓట్లు పోల్‌ అయ్యి 86.36 శాతం ఓటింగ్‌ నమోచేసుకుంది . అయితే ఇందులో 1,06,132 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకోగా ,అందులో 68,985 ఓట్లు తెలుగుదేశానికి వేసి ఉంటారని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

అదేవిధంగా పురుషుల‌లో 1,09,369 ఓట్లు పోల్ అవగా ,వాటిలో 49,216 ఓట్లు తెలుగుదేశం ఖాతాలో ప‌డ్డాట్లు అంచ‌నా వేస్తున్నారు. దీంతో 1,18,201 ఓట్లు టీడీపీకి పడడంతో ,కాల‌వ‌కు పది వేలకుపైగా మెజార్టీ తగ్గదని సాధారణ రాజకీయ విశ్లేషకులు లెక్క‌లు వేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్‌ ఉండటంతో పాటు బీసీ వర్గాల్లో గత ఎన్నికల కంటే ఈ సారి మరింత ఐక్యత కనిపించడం టీడీపీ పార్టీకి క‌లిసోచ్చింద‌ని చెప్ప‌డంతో పాటు , ఈ సారి పోలింగ్ పెర‌గ‌డం కూడా అధికార పార్టీ గెలుపు మ‌రింత సులువు అయ్యింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఈ విశ్లేష‌న‌లు ఆస‌ర‌గా తీసుకున్న బెట్టింగ్ రాయుల్లు టీడీపీ గెలుస్తుందంటూ భారీగా పందాలు కాస్తున్నార‌ని స‌మాచారం అందుతుంది .ఈ బెట్టింగ్ ల‌లో ఎక్కువ శాతం మెజారిటీ మీద‌నే బెట్టింగ్ లు వేస్తున్నార‌ని తెలుస్తోంది .ఆయా వ‌ర్గాల నుండి అందుతున్న స‌మాచారం మెర‌కు బెట్టింగ్ రాయులు పందాలు కాస్తున్న‌ట్లు తెలియ‌వ‌స్తున్న నేప‌థ్యంలో కాల‌వ శ్రీ‌నివాస్ గెలుస్తార‌ని అత్య‌ధిక మంది బెట్టింగ్ లు కాస్తున్న‌ట్లు ఇంటెలిజెంట్ రాజ‌కీయ‌నాయ‌కుల నుండి అందుతున్న స‌మాచారం .దీంతో అక్క‌డి టీడీపీ ప్ర‌త్య‌ర్థిలో భ‌యాందోల‌నలు నెల‌కొని ఉన్న‌ట్లు తెస్తుంది.