//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ పై దేవినేని ఫైర్

Category : state politics

ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ పై మండిపడ్డారు. వైఎస్ జగన్ కు ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీ తప్ప, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించదు అని అన్నారు. ఈ రోజు ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని, మంచిని జగన్ అంగీకరించలేని మానసిక వ్యాధి జగన్ కు ఉంది అని అన్నారు.

పోలవరంలో రికార్డు స్థాయిలో పనులు జరుగుతుంటే, జగన్ ఓర్వలేక పోతున్నాడని, ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్‌ డైరెక్షన్‌ లో సీఎం చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.10 వేల కోట్లు ఖర్చుపెడితే, రూ.25 వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపించడం తగదు అని జగన్ ను ప్రశ్నించారు.

Related News