Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ సర్వే తో సంబరాలు చేసుకుంటున్న తెలుగుతమ్ముళ్లు .....!

Category : politics

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అప్పుడే ఎన్నికల వేడిని తలపిస్తుంది . ఎన్నికలకి ఇంకా ఆరు నెలల సమయం ఉన్న కూడా నేడే ఎన్నికలు ఉన్నాయా అన్నట్టు ఉంది ఇప్పుడు ఏపీ లో పరిస్థితి . తెలంగాణ లో సీఎం కెసిఆర్ శాసన సభని రద్దు చేసి , ముందస్తు ఎన్నికలకి సిద్దమౌతుండడం తో ఏపీ లోకూడా రాజకీయం శరవేగంగా మారుతుంది . కీలక నేతలందరూ కూడా తమ పదవుల్ని నిలుపుకోవడానికి కసరత్తులు అప్పుడే మొదలుపెట్టారు .

మరో ముఖ్య విషయం ఏమిటంటే ఏపీ లో 2019 సార్వత్రిక ఎన్నికలని అన్ని పార్టీ లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి .అన్ని పార్టీల కూడా అధికారమే లక్ష్యంగా వ్యూహాలని సిద్ధం చేసుకొని ఎన్నికల కదన రంగం లోకి దిగబోతున్నాయి . అందులో ఏపీ లో ఉన్న రెండు ప్రధాన పార్టీలకి తోడు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనుంది . దీనితో ఏపీ లో ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు ,

ఇక పొతే లేటెస్ట్ గా నిర్వహించిన ఒక రహస్య సర్వే లో ఏపీ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో మరొకసారి బయటపడింది . సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా జరిగిన ఈ రహస్య సర్వే లో ఈ సారి కూడా మళ్ళీ అధికారం టీడీపీ దే అని తెలుస్తుంది . చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ని చూసిన ప్రజలు ఆయనకి మరొక ఛాన్స్ ఇవ్వాలని ఉన్నారని తెలుస్తుంది . ఇక పొతే టీడీపీ కి వైసీపీ గట్టి పోటీనిచ్చినా కూడా అధికారం చేజిక్కుయించుకోలేదు అని తెలుస్తుంది ,మరో ఐదు ఏళ్ల పటు వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషిచించ తప్పదు అని తెలుస్తుంది ,ఇక పొతే పవన్ జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో తప్ప మరే ఇతర జిల్లాలలో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు అని సమాచారం . దీనితో పవన్ వచ్చే ఎన్నికల్లో మూడో స్థానం తో సరిపెట్టుకోవాల్సిందే అని ఈ సర్వే లో వెల్లడైంది .

Related News