//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగుతమ్ముళ్ల భజనకి బాబు బలైపోతాడా...!

Category : politics

టీడీపీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకంలో అన్ని పార్టీలకంటే ముందుంది. 2009 ఎన్నికలప్పుడు సోషల్ మీడియా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. అలాగే 2014 లో కూడా పెద్దగా సోషల్ మీడియాని ఎన్నికలలో పెద్దగా ఉపయోగించలేదు కానీ, వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియానే ప్రముఖ పాత్ర పోషించేటట్టు కనిపిస్తుంది.

పోయిన ఎన్నికల్లో చంద్రబాబు గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది. అదేమిటంటే బ్రింగ్ ది బాబు అనే క్యాప్షన్ పెట్టి టీడీపీ ని తెగ ప్రమోట్ చేసారు. ఇప్పుడు ప్రపంచం ని సోషల్ మీడియా ఏలుతుంది కాబట్టి ఈ సారి అన్ని పార్టీలు సోషల్ మీడియానే టార్గెట్ గా పెట్టుకొని తమ ప్రచారాలని చేసుకుంటూ పోతున్నారు.

ఎపుడు లేని విధంగా పార్టీ లో ఉండే కొందరు అతిగాళ్లు ప్రత్యేకంగా సోషల్ మీడియా క్లాసులు , డిజిటల్ మీడియా క్లాసులు అంటూ గత రెండేళ్లుగా భారీ మొత్తంలో డబ్బును విచ్చల విడిగా ఖర్చుపెట్టడం జరుగుతుంది. దీనికి తెలుగు తమ్ములుకూడా తన అంటే తందానా అంటూ ఎగబడి పోతున్నారు. దాని మీద చూపే శ్రద్ద వారి చదువుల్లో చూపించింటే , ఇలా సోషల్ మీడియా , డిజిటల్ మీడియా అంటూ తిరిగే వాళ్ళు కారు. మా ముఖ్య ఉద్దేశ్యం ఎవర్ని తక్కువచేయాలని కాదు ...సోషల్ మీడియా ఉపయోగించేవారైతే ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు . ఇక విషయానికొస్తే మళ్ళీ ఆయనే రావాలి అంటూ భజన మొదలుపెట్టారు తెలుగుతమ్ముళ్లు. ఈ భజన చూసి ఇతర పార్టీ అభిమానులు ఎవరు ఎలావస్తారో ప్రజలే నిర్ణయిస్తారని సెటైర్లు వేస్తూ , సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతున్నారు.

పాపం కొంతమంది తముళ్లులకి తెలియని విషయమేమిటంటే ఆ సోషల్ మీడియా వేదికగా చేసే భజన కార్యక్రమాలని అధికార పార్టీ వారు విజయవాడ కేంద్రంగా డబ్బు ఎరగా వేసి సోషల్ మీడియా మీద వదులుతున్నారు. నిజంగా అయన రావాలి అని ప్రజలకి ఉంటె వస్తారుగాని ..ఇలా బలవంతంగా అయన రావాలి ..రావాలి అని చీప్ గా ప్రచారం చేస్తూ అయన మీద ప్రజలకి ఉన్న నమ్మకాన్ని పోగెట్టేలాగా తెలుగుతమ్ముళ్లు భజనలు చేస్తున్నారు.

Related News