//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ఒక్క పథకంతో చరిత్ర సృష్టించబోతున్న టీడీపీ..

Category : politics national

2019 ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ లో రాజకీయ పార్టీలన్నీ తమ తమ పథకాలను చిట్టా ప్రవేశ పెట్టనున్నాయి. అయితే తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తగు జాగర్తలు తీసుకుంటున్నాయి. అధికార టీడీపీ ని ఓడించేందుకు ప్రతిపక్ష వైస్సార్ సీపీ మరియు జనసేన పార్టీలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇవేమి పట్టించుకోకుండా అధికార టీడీపీ ఎలక్షన్ సమయంలో వారిచ్చిన హామీలను పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు.

తాజా సమీకరణాల ప్రకారం టీడీపీ పార్టీ వైపే ఎక్కువ మంది ప్రజలు మగ్గు చూపుతున్నారు. ఆయన చేసే అభివృద్ధి పనులు, గవర్నమెంట్ ఆఫీసులలో అధికారులు తమ తమ పనులు త్వర త్వరగా పూర్తిచేయుంచడం, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలను ఆకర్శించడం, వారు ప్రవేశ పెట్టె కొత్త కొత్త పథకాలు ప్రజలను టీడీపీ వైపు ఆకర్శింపచేస్తున్నాయి.

కానీ ప్రతిపక్ష వైస్సార్ సీపీ మరియు జనసేన పార్టీలు ఏపీని ఏమి అభివృద్ధి చేయలేదని చంద్రబాబు పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షం ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మటం లేదు. పైగా ప్రజలు ఇలాంటి ఉదాహరణలు చెబుతున్నారు.

ఒక సామాన్యుడు 150 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటేనే చాల కష్టపడుతున్నాడు. ఆ ఇంటిని పూర్తిచేయడానికి కనీసం 10 నెలల సమయం పడుతుంది. చేతిలో డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి మరి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. 150 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునే అతనే ఇంత ఇబ్బంది పడితే, ఏ సౌకర్యాలు లేని ఇంత పెద్ద రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేసే తీరు చూసి జనం ఆచ్చర్యపడిపోతున్నారు.

రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కి అమరావతి లో రాజధానిని నిర్మించాడు. ఈ అభివృద్ధిని చూసి దేశంలోనే పెద్ద కార్పొరేట్ సంస్థ రిలైన్స్ అధినేత ముకేశ్ అంబానీ చంద్రబాబును కలిసి పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చాడు. అలాగే ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నాయి.

2019 ఎన్నికలకోసం చంద్రబాబు ఒక పథకాన్ని ప్రవేశ పెట్టనున్నాడు. అదే కనుక నిజమైతే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఎన్నటికీ మరిచిపోలేరు. ఈ ఒక్క పథకం చంద్రబాబును మళ్ళి అధికారంలోకి తీసుకురాగలదని గట్టిగా నమ్ముతున్నారు టీడీపీ పెద్దలు.

Related News