//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హిందూపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్ధం... షాక్ లో టీడీపీ

Category : politics state

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల కోసం కసరత్తులు చేస్తుంటే టికెట్ రాని వాళ్లు పక్క పార్టీలకు జంప్ చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చెయ్యటంతో టీడీపీ కి షాక్ తగిలింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అండగా నిలిచి ఇంత కాలం హిందూపురం లో పార్టీ కోసం పని చేసిన మాజీ ఎమ్మెల్యే పార్టీ వీడటంతో బాలయ్యకు గట్టి దెబ్బే కొట్టినట్టు అయ్యింది. అసలే ఇప్పటకే హిందూపురం లో కాస్త బాలయ్య మీద వ్యతిరేఖత కనిపిస్తున్న తరుణంలో 30 ఏళ్ళుగా టీడీపీ లో పని చేసిన నేత పార్టీ వీడి ఝలక్ ఇచ్చారు.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. హిందూపురంలో మొన్నటి వరకు బాలకృష్ణకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.శనివారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఏపీలో ఎన్నికల సమయంలో టీడీపీ కి ఇది గట్టి దెబ్బ అని తెలుస్తుంది. అబ్దుల్ ఘనీ 30 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ.. పార్టీకి కృషి చేసినా.. తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న బాధలో ఉన్నారు. ఆ కారణంతో పార్టీని వీడినట్లు అబ్దుల్ ఘనీ ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు మైనార్టీలను మోసం చేశారని నాలుగేళ్లుగా మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించిన ఘనీ ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పంచిన ఘనత వైఎస్ఆర్ దేనని అన్నారు.గతంలో హిందూపురం ఎమ్మెల్యేగా 2004, 2009లో రెండు సార్లు అబ్దుల్ ఘనీ టీడీపీ తరపున పోటీచేసి గెలిచాడు.

2014లో బాలకృష్ణ కోసం తన స్థానాన్ని వదులుకున్నాడు. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు టికెట్ వదులుకున్నాడు ఘనీ ..అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఘనీకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. నాలుగేళ్లుగా పార్టీ కోసమే కృషి చేస్తున్నా తనకు సరైన ప్రాధాన్యత లేదని 2019లో వచ్చే ఎన్నికల్లోనూ ఆ టికెట్ మళ్లీ బాలకృష్ణకు దక్కనుందని తెలిసిన ఘనీ వైసీపీ హామీ మేరకు వైసీపీ లో చేరారు. ఇక ఆయన బాలయ్యకు పోటీ గా వైసీపీ నుండి రంగంలోకి దిగటానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి హిందూపురం నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశం కల్పిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం తోనే ఘనీ వైసీపీలోచేరి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

Related News