//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేస్తాం

Category : national politics

రీసెంట్ గా గుడివాడ టీడీపీలో పెల్లుబికిన నిరసనలు, చైర్మన్‌పై అవిశ్వాస పంచాయతీ బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లింది. సీఎం సూచన మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలో చిన్నచిన్న పొరపాట్లు జరిగినట్లే టీడీపీ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయన్నారు. సమస్యను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని ఫ్లోర్‌లీడర్‌ లింగం ప్రసాద్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. గతంలో లింగం ప్రసాద్‌ బతికున్నంత కాలం మాతృసంస్థ టీడీపీలోనే ఉంటానని అయన అన్నారని, దానికి ఆయన కట్టుబడి ఉన్నారని చెప్పారు.



చైర్మన్‌ యలవర్తి ఫై అవిశ్వాసం ప్రకటించిన లింగం ప్రసాద్‌ దానికి వెనుకకు తీసుకోవడంతో పార్టీ సభ్యులు ఆయనని అభినందిస్తున్నానన్నారు. ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సమష్టిగా స్వస్తి పలికామన్నారు. భవిష్యత్‌లో పార్టీ గెలుపునకు సమష్టిగా కృషి చేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ చైర్మన్‌ యలవర్తి, కౌన్సిలర్ల మధ్య రిలేషన్‌ ఇలాగే కొనసాగాలని సూచించారు. అందరూ కలిసి పార్టీ కోసం సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, మాజీ పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Related News