//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ సమేతంగా ఎన్టీఆర్ చిత్రం.

Category : movies

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఇటు క్లాస్ తో పాటు అటు మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఉందని ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలోని పెనీవిటి, అనగనగ సాంగ్స్ ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెంచేసాయి. అక్టోబర్ 11 న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా భారీఎత్తులో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం ఊపు చూస్తుంటే టాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టిన ఆశ్చర్యపోవలిసిన పనిలేదు. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా గురించి NTR మాట్లాడుతూ, ఇది త్రివిక్రమ్ కల, అయన కలలో నేను భాగం అయినందుకు చాల సంతోషం గా ఉంది అని అన్నారు. అది ఒక్కఎత్తైతే ఈ సినిమా ఆన్ లైన్ టిక్కెట్లు విడుదల చేసిన వెంటనే అయిపోయాయి.

ఈ చిత్రం ప్రీమియర్ షోల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ఏపీ ప్రభుత్యం ఎన్నడూ లేనివిధంగా NTR సినిమాకి సపోర్ట్ చేస్తుంది. హరికృష్ణ మరణానంతరం నందమూరి ఫ్యామిలీ ఏకమైనా సంగతి తెలిసిందే. ఇటు బాబాయ్ బాలకృష, అటు మామయ్య చంద్రబాబు సపోర్ట్ తో నందమూరి, నారా ఫాన్స్ అంత ఏకతాటిమీదకి వచ్చారు.

ఇప్పుడు ఏ సిటీలో చూసిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్టీఆర్, హరికృష బ్యానర్ల తో దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. టీడీపీ సమేతంగా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తుండటంతో బారి కలెక్షన్స్ రావడం ఖాయమని అంటున్నారు సినీ ట్రేడ్ పండితులు.