//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీతో దోస్తీ కటీఫ్

Category : politics

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలు అంతా ఆగ్రహోద్రులవుతున్నారు.చంద్రబాబు నేతలతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు.బీజేపీతో పొత్తు విషయమై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ మాట తీరు చూస్తుంటే త్వరలో బీజేపీకి రాం రాం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.కొందరు నేతలు ఓపిక పడదామని సూచనలు చేస్తున్నప్పటికీ, ఇంకా ఎన్నాళ్లని ఓపిక పడతామని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే, ఏపీకి ఏమీ చేయని బీజేపీతో కలిసి నడిస్తే 2019లో ప్రజలు మనకూ కూడా బుద్ధి చెబుతారని అంటున్నారు.

బీజేపీతో చంద్రబాబు తాడోపేడో తేల్చుకుంటారని టీడీపీ నేతల తీరును బట్టి అర్థమవుతోంది.కొందరు ఆచితూచి మాట్లాడుతున్నప్పటికీ బీజేపీతో కటీఫ్‌కు హింట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంపై స్పందించిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు.తాజాగా ఆయన గుంటూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాయపాటి మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు విష‌యంపై కూడా న‌మ్మకం లేదని అన్నారు.బీజేపీతో మైత్రిని కొనసాగించాలా వ‌ద్దా అన్న అంశంపై సీఎం చంద్ర‌బాబుతో ఎల్లుండి సమావేశం జ‌రుపుతున్నామ‌ని, ఆ తర్వాత ఓ నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని తేల్చి చెప్పారు.

Related News