//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ తొలి జాబితా రెడీ ... 74 మంది పేర్లు ఫైనల్

Category : politics state

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుంటే సీఎం చంద్రబాబు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా 74 మందితో తోలి జాబితా సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు మరోసారి కుప్పం నుంచి, సినీనటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం స్ధానంలోనూ బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేసే స్ధానాన్ని ఇంకా ఖరారు చేయలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి సతీష్ రెడ్డినే బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ మారతారని తీవ్రంగా ప్రచారం జరిగిన నంద్యాల, ఆళ్లగడ్డ స్ధానాల్లో భూమా కుటుంబ సభ్యులకే మరోసారి అవకాశం ఇవ్వనున్నారు.

నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ నుంచి మంత్రి ఆఖిలప్రియ మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. నగరిలో గాలి మద్దుకృష్ణమనాయుడు కుమారుడు భాను ప్రకాష్, శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి అవకాశం లభించనుంది. రాజాం నుంచి ఈ మధ్యే టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొండ్రు మురళికి టికెట్ కేటాయించనున్నారు. త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్న డీఎల్ రవీంద్రారెడ్డికి ఆయన గతంలో పలుమార్లు గెలిచిన కడప జిల్లా మైదుకూరు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఖరారు చేసిన అధినేత చంద్రబాబు... వారికి ఎన్నికల కోసం సిద్ధం కావాలని సూచించారు.

కడప, రాజంపేట పార్లమెంట్ స్ధానాల పరిధిలో అభ్యర్ధులు ఖరారు కావడంతో దాదాపుగా తొలి విడత జాబితాపై క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇప్పటికే కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 70కి పైగా పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపుగా గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ అభ్యర్ధులే ఉన్నారు. అతి కొద్ది స్ధానాల్లో మాత్రమే మార్పులు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి నారాయణ ఈసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా... తాజాగా ఎమ్మెల్సీ పదవి వదులుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి సర్వేపల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు. కడప జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబంతో ఒప్పందంలో భాగంగా జమ్మలమడుగుకు బదులుగా కడప ఎంపీ స్ధానంలో పోటీ చేయనున్నారు.